కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఎన్నో సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి.థియేటర్లు కూడా మూతపడటంతో చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. దీంతో సినిమా నిర్మాతలు ఆర్ధికంగా చాలా నష్టపోయారు. ఇప్పుడు షూటింగ్ లకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పటికీ… ఇప్పటివరకూ వాటిల్లిన నష్టాలను భర్తీ చెయ్యాలి అంటే నటీ నటుల పారితోషికాల్లో కోతలు విధించాల్సిందే. అయితే ఇందుకు అందరు నటీ నటులు ఒప్పుకుంటారని చెప్పలేము. వాళ్ళే కనికరించి ముందుకు వస్తేనే కానీ సాధ్యం కానీ పరిస్థితి..!
అయితే హీరోయిన్స్ లో కీర్తి సురేష్.. తన పారితోషికం తగ్గించుకోవడానికి రెడీ అయ్యింది.ఇప్పుడు ఈమె బాటలో మరో హీరోయిన్ నివేదా థామస్ కూడా ముందుకు వచ్చింది. అయితే ఈమెకు కీర్తి సురేష్ కు వచ్చినంత పారితోషికం అయితే రాదు కానీ..! తాను అందుకునే పారితోషికంలో కొంత శాతం తగ్గించుకుంటుందట. ఈమె మంచి ట్యాలెంటెడ్ హీరోయిన్. ‘జెంటిల్ మెన్’ ‘నిన్ను కోరి’ ‘జై లవ కుశ’ ‘118’ ‘బ్రోచేవారెవరురా’ వంటి హిట్ సినిమాలు ఈమె ఖాతాలో ఉన్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, అల్లు అర్జున్ ‘పుష్ప’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ‘కథ తనకు నచ్చితే పారితోషికం విషయంలో రాజీ పడతానని’ ఈమె తెలిపింది. ఈమె నిర్ణయానికి ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయి.
Most Recommended Video
తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!