సినిమా పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన నటుడు నివిన్ పౌలీ. మలయాళ సినిమాల్లో హీరోగానే కాకుండా ప్రత్యేక పాత్రలో కనిపించి చిత్ర విజయం లో ప్రముఖ పాత్ర వహించాడు. అనేక అవార్డ్స్ అందుకున్నాడు. మాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న నివిన్ రీల్, రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు..
తల్లిదండ్రులకు దూరంగా..కేరళలోని అవులలో అక్టోబర్ 11న నివిన్ జన్మించాడు.తల్లిదండ్రులు పని నిమిత్తం స్విర్జల్యాండ్ కి వెళ్ళిపోగా నివిన్ మాత్రం ఇక్కడే వుండి చదువుకున్నాడు. సెలవుల్లో పేరంట్స్ వద్దకు వెళ్లి కొన్నిరోజులు గడిపి మళ్లీ కేరళకు వచ్చేసేవాడు.
ఇన్ఫోసిస్లో ఉద్యోగం వదిలి ..కేరళలోనే నివిన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసారు. తర్వాత బెంగళూర్లోని ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం పొందాడు. రెండేళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత రాజీనామా చేసి.. సినిమాలో తన లక్ ను పరీక్షించు కోవడానికి కేరళకి వచ్చేశాడు.
క్లాస్ మేట్ ని పెళ్లాడి…నివిన్ తన ఇంజనీరింగ్ క్లాస్ మేట్ రిన్నాను 2010లో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమకు ప్రతి రూపం దావీద్. భార్య, కొడుకే నివిన్ ప్రపంచం.
తొలిసారి రిజెక్ట్ అయ్యాడు..వినీత్ శ్రీనివాసన్ వారి మలర్వది ఆర్ట్స్ క్లబ్ సినిమా ద్వారా నివిన్ వెండితెర పై కనిపించాడు. ఈ సినిమా కోసం జరిగిన ఆడిషన్లలో నివిన్ మొదట రిజెక్ట్ అయ్యాడు. అయినా నివిన్ వదలలేదు. మళ్ళీ మళ్ళీ ఆడిషన్స్ కు వెళ్ళాడు. చివరికి అవకాశాన్ని దక్కించుకున్నాడు.
ఎన్నో పాత్రల్లో మెరిపించి..సినిమాల్లో అడుగు పెట్టిన కొత్తల్లో నివిన్ కి చిన్న పాత్రలు లభించేవి. అయినా ఇష్టంతో చక్కగా నటించాడు. ట్రాఫిక్, ది మెట్రో, స్పానిష్ మసాల, సెవన్స్ వంటి చిత్రాల్లో నటించాడు. తట్టతిన్ మరయతు సినిమా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఈ సినిమాకు కూడ వినీత్ శ్రీనివాసన్ దర్శకుడు. 2012 లో రిలీజ్ అయినా ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. నివిన్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత 2014 లో వచ్చిన బెంగళూరు డేస్ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడు.
ఆరాధించే వ్యక్తిగా..కొచి టైమ్స్ 2015 లో నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ మాన్ గా నివిన్ పౌలీ నిలిచాడు. నివిన్ కి కేరళ లో ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. స్వశక్తి తో స్టార్ గా ఎదిగిన నివిన్ అంటే మాలీ వుడ్ లో చాలా మందికి అభిమానం. అతని కోసం మంచి కథలను సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల ద్వారా నివిన్ మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటానడంలో ఏ సందేహం లేదు.