ఫేక్ న్యూస్ పై మండిపడ్డ శంకర్!

తమిళ అగ్ర దర్శకుడు శంకర్ కి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం విడుదలైన ‘రోబో’ సినిమా కథకు సంబంధించి ఇప్పటికీ ఓ కేసు నడుస్తోంది. అరుర్‌‌ తమిళ్‌ నందన్ అనే రచయిత రాసిన ‘జిగుబా’ అనే కథను కాపీ చేసి దర్శకుడు శంకర్ ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అరూర్ ఆరోపించారు. చాలా కాలంగా కోర్టులో ఈ కేసు నలుగుతోంది. ఈ కేసు విషయంలో శంకర్ స్పందించడం లేదని ఆగ్రహించిన కోర్టు శంకర్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసినట్లు మీడియా వర్గాల్లో వార్తలు వచ్చాయి.

దీంతో ఈ అరెస్ట్ వారెంట్ పై స్పందించాడు దర్శకుడు శంకర్. తనకు ఎలాంటి వారెంట్ జారీ చేయలేదని శంకర్ స్పష్టం చేశాడు. కోర్టు ఆన్లైన్ వ్యవహారాల్లో తప్పిదం కారణంగా వారెంట్ జారీ అయినట్లు ప్రచారం జరిగిందని.. ఇప్పుడు ఆ పొరపాటుని సరిదిద్దుతున్నారని.. శంకర్ తెలిపారు. నిర్ధారణ లేకుండానే తప్పుడు వార్తలు ప్రసారం కావడం తనను విస్మయానికి గురిచేసిందని ఆయన అన్నారు. ఈ తప్పుడు వార్తల వలన తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అనవసరంగా టెన్షన్ పడ్డారని చెప్పారు.

ఇలాంటి వార్తలు ప్రసారం చేసేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మండిపడ్డారు. ప్రస్తుతం శంకర్ చేతిలో ‘ఇండియన్ 2’లాంటి భారీ ప్రాజెక్ట్ ఉంది. కానీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో శంకర్ తన కొత్త సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడని.. హీరో యష్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో భారీ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus