సినిమా ఇండస్ట్రీకి ప్రతి శుక్రవారం చాలా కీలకం. సినిమాలు వస్తాయి కదా అందుకు అనుకుంటున్నారా? కేవలం సినిమాలొస్తాయనే కాదు… ఎంతోమంది లైఫ్ మారుతోంది ఆ రోజుతో. ఇంకెంతోమందికి కొత్త భవిష్యత్తు కూడా దక్కుతుంది. అలాంటి శుక్రవారాన్ని సినిమా ఇండస్ట్రీలో బంగారం అంటుంటారు. అలాంటి బంగారం లాంటి శుక్రవారాల్లో ఈ వారం వృథా చేసుకుంటున్నారా? ఏమో మరి ఈ వారం విడుదలవుతున్న సినిమాల పేర్లు, వాటి సంగతి చూస్తే అదే అనిపిస్తోంది.
ఓవైపు సినిమాల విడుదలకు థియేటర్లు దక్కడం లేదని చర్చ నడుస్తుంటే… మరో ఈ వారం థియేటర్లు వెలవెలబోతాయి. కావాలంటే ఈ వారం విడుదలయ్యే సినిమాల లిస్ట్ చూడండి. అయితే అతి వృష్టి లేకపోతే అనావృష్టి అనేలా గత వారం కుప్పలుకుప్పలుగా సినిమాలు వచ్చేశాయి. అన్నీ చిన్న సినిమాలే అయినా… అందులో కొన్ని ప్రామిసింగ్‌వి ఉన్నాయి కూడా. ఒకే వారం ఇన్ని అవసరమా అనే మాట కూడా ఈ వారం వినిపించింది. అయితే ఈ వారం పెద్దగా సినిమాలు లేవు.
అక్టోబర్ 13న ఏయే సినిమాలు వస్తున్నాయనే లెక్క ఓసారి చూస్తే… రాబోయేవన్ని చిన్న సినిమాలే. ‘తంతిరం చాప్టర్ 1 టేల్స్ అఫ్ శివకాశి’, ‘మధురపూడి గ్రామం అనే నేను’, ‘రాక్షస కావ్యం’, ‘ప్రేమ యుద్ధం’, ‘ఒక్కడే 1 వెంకన్న ఆన్ డ్యూటీ’ సినిమాలు థియేటర్లలో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి. ఈ సినిమాలు అసలు ఉన్నాయా, ఎప్పుడు మొదలయ్యాయి, అసలు రిలీజ్ ఉందా అనే సమాచారం కూడా సగటు సినీ జనాలు ఉంటుంది అని ఆశించలేం.
ఇవి కాకుండా జయం రవి, నయనతారల రీమేక్ సినిమా ‘గాడ్’ మాత్రం వస్తోంది. అక్కడ అయితే ఇప్పటికే సినిమా పోయింది. మరి తెలుగులో మంచి టాక్ ఆశించలేం. ఈ సినిమాతోపాటు కొన్ని హిందీ సినిమాలున్నాయి. అవి మల్టీప్లెక్స్‌ల వరకే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ వారాన్ని ఇలా ఎందుకు వదిలేశారు అనే ప్రశ్న మొదలైంది. వచ్చే వారం దసరా ఉండటం వల్లే ఇలా ఈ వారం ఖాళీగా మారిపోయింది అనేది ఓ అంచనా.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు