స్టార్ హీరోల బాక్సాఫీస్ వార్ పై లేటెస్ట్ అప్డేట్!

వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయని అధికారికంగా ప్రకటించారు. వాటిలో ఒకటి మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కాగా.. రెండోది పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండడంతో బాక్సాఫీస్ వార్ తప్పదని భావించారు అభిమానులు. కొన్నిరోజుల క్రితం దీనికి సంబంధించి చాలా కథనాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్, మహేష్ మధ్య పోటీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

మహేష్ నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమా సంక్రాంతికి రెడీ అయిపోతుంది. షూటింగ్ లో ఆలస్యం జరిగినా.. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ వర్క్, భారీ సెట్స్ లేవు. కాబట్టి సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ‘హరిహర వీరమల్లు’ సినిమాకు మాత్రం గ్రాఫిక్స్, సెట్స్ రెండూ అవసరమే. కాబట్టి సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

‘హరిహర వీరమల్లు’ సినిమాకి సంబంధించి నలభై శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మిగతా షూటింగ్ కంప్లీట్ చేయడానికి కనీసం నాలుగు భారీ సెట్స్ అవసరం. కరోనా వలన ఆ పనులన్నీ ఆగిపోయాయి. పైగా ఈ సినిమా కంటే ముందుగా.. ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ ను కంప్లీట్ చేయాలి. ఆ తరువాతే క్రిష్ సినిమాను మొదలుపెడతారు. కాబట్టి ‘హరిహర వీరమల్లు’ సినిమా ఆలస్యమవుతుందని స్పష్టమవుతోంది. ఈ లెక్కన చూస్తే సినిమా చెప్పిన సమయానికి రాకపోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్, మహేష్ మధ్య పోటీ లేనట్లే!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus