Akkada Ammayi Ikkada Abbayi: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ హిట్ అయినా ప్రదీప్ కలిసొచ్చింది ఏమీ లేదా?

యాంకర్ ప్రదీప్ కి (Pradeep Machiraju) బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఫిమేల్ యాంకర్స్ లో సుమకి ఏ స్థాయి క్రేజ్ ఉందో.. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కి ఆ రేంజ్ క్రేజ్ ఉంది అని చెప్పాలి. అతని క్రేజ్ ను గుర్తించి కొంతమంది చిన్న నిర్మాతలు.. అతన్ని హీరోగా పెట్టి సినిమాలు చేయాలని భావించారు. అలా వచ్చిందే ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా.

Akkada Ammayi Ikkada Abbayi

కోవిడ్ టైంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అలా అని ప్రదీప్ వరుసగా సినిమాలు తీసి క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) అనే సినిమా చేశాడు. ప్రదీప్ కి జోడీగా ఇందులో దీపికా పిల్లి (Deepika Pilli) హీరోయిన్ గా చేసింది. నితిన్ – భరత్ దర్శకత్వం వహించారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), మహేష్ బాబు  (Mahesh Babu) వంటి స్టార్లు ఈ సినిమాకి పుష్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఏప్రిల్ 11న థియేటర్లలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అయితే ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హిట్టు కొట్టినా సరే.. ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ కి బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదట. ఆ సినిమా ఫుల్ రన్లో రూ.7 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. అయినా సరే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాకి రూ.4 కోట్ల రేంజ్లోనే బిజినెస్ జరిగినట్లు సమాచారం. సో హిట్ ఇచ్చినప్పటికీ ప్రదీప్ కి ఎటువంటి మార్కెట్ ఏర్పడలేదు అని స్పష్టమవుతుంది. ఒకవేళ ఇది హిట్ అయితే.. ఏదైనా అద్భుతం జరగొచ్చు.

విశ్వక్ సేన్ కి సిద్ధు జొన్నలగడ్డకి పడట్లేదా..? అసలేమైంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus