Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఘాటు చూపించే డేటు.. లేదే లేదు డౌటు!

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఎక్కువ పుకార్లు వచ్చిన, వస్తున్న సినిమాల లిస్ట్‌ అంటూ ఒకటి రాస్తే… తొలి స్థానంలో ఉండే సినిమా ‘గుంటూరు కారం’. సినిమా ప్రకటన ముందు నుండి ఇప్పుడు మహేష్‌ బర్త్‌డే పోస్టర్‌ వరకు అన్ని విషయాల్లో పుకార్లు షికార్లు చేశాయి. వీటిలో తాజా పుకారు ఏంటంటే… సినిమా ముందుగా చెప్పినట్లు వచ్చే సంక్రాంతికి రాదు అని. అయితే ఈ విషయంలో చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. పోస్టర్‌లో రిలీజ్‌ డేట్‌ను పెద్ద అక్షరాలతోనే ఇచ్చారు.

మహేశ్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం అర్ధరాత్రి స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. లుంగీ కట్టుకుని, బీడీ కాలుస్తూ మహేశ్‌ మాస్‌ లుక్‌లో అదరగొట్టాడు. చూస్తుంటే ‘భీమ్లా నాయక్‌’ సినిమాలో పవన్‌ పోస్టర్‌ లుక్‌లానే ఉంది. అందులో పవన్‌ కర్ర పట్టుకుంటే ఇందులో బీడీ సిగరెట్‌ పట్టుకున్నాడు. అదొక్కటే తేడా… మిగిలిందంతా సేమ్‌ టు సేమ్‌. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ విడుదల చేస్తున్నట్లు గతంలో చెప్పిన మాటను మరోసారి ఉద్ఘాటించింఇ టీమ్‌.

అలాగే మరో పుకారు అయిన ‘థమన్‌ ఔట్‌’పై క్లారిటీ వచ్చేసింది. సినిమా పోస్టర్‌పై థమన్‌ పేరు అలానే ఉంది. అయితే అభిమానుల వెలితి మాత్రం అలానే ఉండిపోయింది. అదే సినిమా నుండి మరో టీజర్‌. పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్‌ కోసం టీజర్‌ వస్తుందేమో అనుకున్నారంతా. కానీ ఇవ్వేలేదు. అయితే ఆగస్టు 15కి ఇస్తారేమో అనే ఆశతో ఫ్యాన్స్‌ ఇప్పుడు ఉన్నారు.

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలో మహేశ్‌ బాబుకి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. అమరావతి, గుంటూరు పరిసర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. రెండు దగ్గరి కుటుంబాల మధ్య వైరం అనే అంశాన్ని సినిమాలో చూపిస్తారట. అయితే ఇందులో పురాణాలు, ఇతిహాసాల టచ్‌ ఎలానూ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్‌ కాబట్టి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus