పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీయం అయ్యాక విడుదలవుతున్న మొదటి సినిమా “హరిహర వీరమల్లు” చాలారోజుల తర్వాత పవన్ నుంచి స్ట్రయిట్ సినిమా మరియు ప్యాన్ ఇండియన్ సినిమా కావడంతో అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. అందులోనూ ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా పబ్లిసిటీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి రెండు రోజులపాటు సినిమాను తనకు వీలైంతలో బాగానే ప్రమోట్ చేశాడు.
నిర్మాత ఏ.ఎం.రత్నం ఎంతో కష్టపడి ఇరు తెలుగు రాష్ట్రాల నుండి టికెట్ హైక్ మరియు ప్రీమియర్ షోస్ పర్మిషన్స్ తెచ్చుకున్నారు కూడా. కానీ.. ఇప్పటివరకు హైదరాబాద్ లోని మైత్రీ థియేటర్ మినహా ఎక్కడా ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోవడం గమనార్హం. పుష్ప 2 సినిమా టైమ్ లో కూడా ఇలానే జరిగి.. ఆఖరికి సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే షోస్ వేశారు. మరి హరిహర వీరమల్లుకి కూడా అదే బాట పడతారా అనేది తెలియాల్సి ఉంది.
అయితే.. సినిమా బడ్జెట్ & టాక్ ను కన్సిడర్ చేస్తే రాత్రికి ఎన్ని ఎక్కువ షోస్ పడితే నిర్మాతకు అంత మంచిది. మరి ఈ విషయంలో మైత్రీ సంస్థ త్వరగా ఏదో ఒకటి తెలిస్తే బెటర్. పాపం జనాలు కూడా బుకింగ్స్ ఎప్పడు ఓపెన్ అవుతాయా అని బుక్ మై షో మరియు డిస్ట్రిక్ట్ యాప్స్ ను రీఫ్రెష్ చేసీ చేసీ నీరసపడిపోయారు.
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించిన ఈ చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకులుగా వ్యవహరించగా.. చాలా ఒడిదుకులను ఎదురొడ్డి జూలై 24న రిలీజ్ అవుతున్న “హరిహర వీరమల్లు” సినిమా హిట్ అవ్వడం అనేది హీరోగా పవన్ కళ్యాణ్ కంటే.. నిర్మాతగా రత్నంకి చాలా కీలకం.