Pawan Kalyan: 15 సినిమాలన్నారు.. మరిప్పుడు పరిస్థితి ఏంటో..?

కొన్నాళ్ల క్రితం పవన్ కళ్యాణ్ కు చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ తో తాము భాగస్వామ్యం అయినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీడియా ముఖంగా వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా ఈ రెండు బ్యానర్లు కలిసి 6 చిన్న సినిమాలు, మరో ఆరు మీడియా రేంజ్ బడ్జెట్ సినిమాలు, ఇంకో మూడు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నాయని.. ఈ 15 సినిమాల్లో దాదాపు 10 సినిమాలతో కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తామని కూడా ప్రకటించారు.

ఈ ప్రకటన వచ్చి ఇప్పటికి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్పటివరకు ఈ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రాలేదు. ఎలాంటి ప్రణాళిక వెల్లడించలేదు. ఈ గ్యాప్ లో తన సినిమాలు తాను చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అటు పీపుల్ మీడియా నిర్మాతలు కూడా తమ సినిమాలేవో తాము ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాదిలో జరిగిన పరిణామం ఏదైనా ఉందంటే అది ‘వినోదాయ సితం’ రీమేక్ మాత్రమే. పవన్ తో ఈ రీమేక్ ప్లాన్ చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

పవన్ కీడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒరిజినల్ సినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖని రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాపై ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. మధ్యలో జీ స్టూడియోస్ కూడా వచ్చి చేరింది. ఈ రీమేక్ సంగతి పక్కన పెడితే.. మిగిలిన సినిమాలపై ఈ బ్యానర్ల భాగస్వామ్యంపై క్లారిటీ రావడం లేదు.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ప్రపోజల్ చాలాకాలంగా పెండింగ్ లో ఉంది. పీపుల్ మీడియా బ్యానర్ భాగస్వామిగా మారడంతో పవన్ బ్యానర్ పై చరణ్ సినిమా కచ్చితంగా ఉంటుందని మెగాఫ్యాన్స్ ఆశ పడ్డారు. కానీ దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus