కొత్త సినిమాలు ఒక్కటి కూడా వర్కవుట్ కాలేదే!

జూన్ చివరివారం టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. చెప్పుకోదగ్గ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. పెద్ద సినిమాల సందడి వేసవితో ముగియగా.. ఈ నెల ఆరంభం నుంచి మీడియం రేంజ్ సినిమాలే వస్తున్నాయి. కానీ చివరి వారానికి వచ్చేసరికి ఆ స్థాయి సినిమాలు కూడా లేవు. ‘సమ్మతమే’, ‘చోర్ బజార్’, ‘7 డేస్ 6 నైట్స్’ లాంటి చిన్న సినిమాలే బరిలో నిలిచాయి. కానీ ఇవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కాస్తో కూస్తో ‘సమ్మతమే’ సినిమా పరిస్థితి కాస్త బెటర్ గా ఉంది.

గీతాఆర్ట్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడంతో కాస్త బజ్ వచ్చింది. దీంతో ఓ మోస్తరు ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా. కానీ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. రివ్యూలన్నీ కూడా నెగెటివ్ గానే వచ్చాయి. ఓ మోస్తరు ఆక్యుపెన్సీతో వసూళ్లు రాబట్టిన సినిమా మాత్రం సమ్మతమే. ఆదివారం తరువాత ఈ సినిమాకి కలెక్షన్స్ లేవు. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటించిన ‘చోర్ బజార్’ సినిమాకి మరీ దారుణమైన టాక్ వచ్చింది.

దీంతో ఏ దశలో కూడా సినిమా పుంజుకోలేదు. మాస్ సినిమా కావడంతో తొలిరోజు కాస్త కలెక్షన్స్ వచ్చాయి. ఆ తరువాత ఎవరూ సినిమాను పట్టించుకోలేదు. ఎమ్మెస్ రాజు రూపొందించిన ‘7 డేస్ 6 నైట్స్’ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ‘డర్టీ హరి’ తరహాలో ఎరోటిక్ సీన్స్, థ్రిల్లింగ్ కంటెంట్ తో ఈ సినిమా ఉంటుందని ఆశించారు ప్రేక్షకులు. కానీ సినిమా మొత్తం డల్ గా ఉండడంతో మంచి టాక్ ఏం రాలేదు.

వసూళ్లు లేవు. ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’, ‘సదా నన్ను నడిపే’ ఇలా కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి కానీ వాటిని ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇక ఈ వారం ‘పక్కా కమర్షియల్’ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus