Bigg Boss 7 Telugu: లాజిక్ లేని శివాజీ పాయింట్స్..! వాళ్లని కావాలనే రెచ్చగొట్టాడా ?

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్స్ లో శివాజీ అడ్డంగా ఆడియన్స్ కి దొరికిపోయాడు. శివాజీ నామినేషన్స్ కి ముందు రతికకి కౌన్సిలింగ్ చేశాడు. నువ్వు భయపడుతున్నావ్ ని భయం వదిలేసి నీ టాలెంట్ చూపించమని చెప్పాడు. ఎవ్వరికీ భయపడద్దు. నన్ను నమ్ము నీకు బాగా ప్లస్ అవుద్ది అని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన రతిక వెళ్లి ప్రియాంకని ఇంకా శోభాశెట్టిని నామినేట్ చేసింది. అలాగే, శివాజీ నామాట విను అంటూ రతికని ఇన్ఫులెన్స్ చేసేసరికి శివాజీ చాలా లెక్కలు వేసి చెప్తాడనే నమ్మకంతో ఎలిమినేట్ అవ్వను అనే థీమాతో డ్రామా చేసింది రతిక.

అస్సలు పాయింట్ లేని చోట ఓవర్ యాక్షన్ తో సీన్ చేసింది శోభాశెట్టిని నామినేట్ చేస్తూ కెప్టెన్సీ బాలేదని చెప్పింది. కానీ, హోస్ట్ నాగార్జున ముందు చేయి లేపలేదనే విషయం గుర్తు లేదు. అలాగే, ప్రియాంక విషయంలో కూడా రతిక రాజమాతగా డెసీషన్ తీస్కునే ముందు డిస్కషన్ పెట్టలేదని నామినేషన్ వేసింది. దీంతో ప్రియాంక కూడా రతికకి బాగా గడ్డి పెట్టింది. అక్కడ చెప్పకుండా వచ్చి ఇక్కడెందుకు చెప్తున్నావ్ అంటూ నిలదీసింది. ఇలా శివాజీ కేవలం రతికని మాత్రమే కాదు, పల్లవి ప్రశాంత్ ని సైతం ఈ నామినేషన్ లో బ్యాక్ అప్ చేశాడు.

అర్జున్ చెప్పిన పాయింట్స్ కి పల్లవి ప్రశాంత్ రెచ్చిపోతుంటే, కూల్ చేశాడు. అతను చెప్పిన పాయింట్ ని ఆలోచించమని కోపం తెచ్చుకోకని చెప్పాడు. అర్జున్ పల్లవి ప్రశాంత్ కి బాగా గట్టిగానే గడ్డి పెట్టాడు. ఎక్కడా కూడా నువ్వు నీ వ్యక్తిగతంగా గేమ్ ఆడటం లేదని బరాబర్ రాసి మరీ చెప్తానని అన్నాడు. దీనికి పల్లవి ప్రశాంత్ డిపెండ్ చేసుకోకుండా చాలాసేపు అర్జున్ తో వాదన పెట్టుకున్నాడు. దీంతో శివాజీ పల్లవి ప్రశాంత్ కి హితబోధ చేశాడు. వెళ్లి అర్జున్ తో మాట్లాడమని చెప్పాడు. దీనివల్ల మొత్తం సెట్ అవుతుందని అన్నాడు.

అలాగే యావర్ కి కూడా వేరేవాళ్ల పాయింట్స్ వద్దంటూ శివాజీ చెప్పాడు. ఇక ఆ తర్వాత శివాజీ నామినేషన్స్ కూడా లాజిక్స్ లేకుండా చాలా చప్పగా అనిపించాయ్. తనని గతవారం రాజమాతలు నామినేట్ చేశారనే ఉద్దేశ్యంతో రతికని వారిపై ఉసిగొల్పి రెచ్చగొట్టాడా ? లేదా తనకి నామినేట్ చేసే స్కోప్ ఉన్నా వాదించడం ఇష్టం లేక ఇలా చేశాడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే శివాజీ ప్రియాంకని, ఇంకా గౌతమ్ ని నామినేట్ చేసిన పాయింట్స్ కూడా అంత వాలిడ్ గా లేవనే కామెంట్స్ చేస్తున్నారు బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఆడియన్స్. అదీ మేటర్.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus