టాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, అదృష్టం, కాస్త లౌకిక తత్వం కూడా ఉండాలి. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది దర్శకుల్లో కొందరు తొలి సినిమా బారీ డిజాస్టర్ అయినా, తదుపరి వెంట వెంటనే అవకాశాల వెల్లువ కొనసాగింది. ఉదాహరణకు మెహర్ రమేశ్ నే తీసుకోండి తొలి సినిమా భారీ డిజాష్టర్ అయినా, వరుసగా, పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. అయితే అదే క్రమంలో ఎంతో మంది యువ దర్శకులు మంచి సినిమాలను అందించినా వారికి అవకాశాలు రాకపోవడం ఒకింత బాధాకరమే. ఆ విషయాలే తీసుకుంటే…ఉయ్యాలా…జంపాల అంటూ అందరినీ ఒక్కసారిగా ప్రేమ ఊయల ఊగించిన ‘విరించి వర్మ’ ఇప్పటికీ తనకు రెండో అవకాశం వచ్చినట్లుగా ఎక్కడ కనిపించలేదు. ఇక రచ్చ, బెంగాల్ టైగర్ దర్శకుడు సంపత్ నంది సైతం తన తరువాత సినిమా విషయంలో పెద్దగా క్లారిటీ లేదు. ఇక పవన్ కల్యాణ్ ను భారీ హిట్ ఇచ్చి, ఎన్టీఆర్ కు భారీ డిజాస్టర్ ను మిగించిన దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ మధ్యనే ఏదో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అన్న సినిమా చేశాడు కానీ, ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చేసేది ఏమీ లేక, అవకాశాలు లేక ఖాళీగా కూర్చున్నాడు. మరో పక్క ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్ – ఎక్స్ ప్రెస్ రాజా’లతో ఇండస్ట్రీ లో మంచి హిట్ కొట్టిన మేర్లపాక గాంధీ చెర్రీకి, నాగ చైతన్య కి కధలు చెప్పడం మినహా, ఇంకా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేదు. ఇలా ఎంతో మంది దర్శకులు టాలెంట్ ఉంది కూడా అవకాశాల కోసం ఎదురుచూడడం నిజంగా బాధపడాల్సిన విషయమే, కానీ ఏం చేస్తాం, కొంపిటేషన్ అలాంటిది కదా. చూద్దాం ఏం జరుగుతుందో.