Chiranjeevi: చిరంజీవికి ఎలాంటి న్యూమరాలజీ సెంటిమెంట్ లేదట!

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. ఇదే సమయంలో చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి పేరులో చిన్న మార్పు కనిపించింది. ఆయన స్పెల్లింగ్ Megastar Chiranjeevi కాగా.. చిరంజీవి పేరులో ఒక ‘E’ని యాడ్ చేసి.. Megastar Chiranjeeevi అని స్క్రీన్‌పై వేశారు. దీంతో ఆయన పేరు మార్చుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మీడియాలో కూడా వార్తలొచ్చాయి. ఆయన న్యూమరాలజీ ప్రకారం తన పేరులో ఒక అక్షరాన్ని యాడ్ చేశారంటూ కథనాలను ప్రచురించారు. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది. అది కేవలం స్పెల్లింగ్ మిస్టేక్ అని యూనిట్ వర్గాలు చెబుతున్నారు. ఇప్పటికే కరెక్ట్ చేశామని.. యూట్యూబ్ లో ‘గాడ్ ఫాదర్’ఫస్ట్ లుక్ వీడియోలో త్వరలోనే ఈ మార్పు రిఫ్లెక్ట్ అవుతుందని అన్నారు. అంటే ఈ న్యూమరాలజీ వార్తలన్నీ రూమర్స్ అన్నమాట. మెగాస్టార్ చిరంజీవి ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో మార్చుకోని పేరుని ఇప్పుడెందుకు మార్చుకుంటారని అభిమానులు కూడా ట్విట్టర్ వేదికగా సందేహాలు వ్యక్తం చేశారు.

ఇప్పుడు వారి డౌట్స్ కి ఆన్సర్ దొరికినట్లే. ఇక చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మలయాళంలో వచ్చిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు చిరంజీవి.

బాబీ దర్శకత్వంలో ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా సెట్స్ పై ఉంది. అలానే మెహర్ రమేష్ ‘భోళా శంకర్’ సినిమాను కూడా మొదలుపెట్టారు. వీటితో పాటు వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ఒకటి కమిట్ అయ్యారు. మరో రెండు మూడేళ్లలో చిరంజీవి నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus