అతని ఆటిట్యూడే అతని కొంప ముంచిందా!

సంగీత దర్శకుడు రథన్ (Radhan) అందరికీ సుపరిచితమే. తమిళనాడుకు చెందిన టెక్నిషియన్ అయినప్పటికీ తెలుగులో ఇతని వర్క్ కి మంచి అప్రిసియేషన్ దక్కింది. హను రాఘవపూడి తెరకెక్కించిన ‘అందాల రాక్షసి’ (Andala Rakshasi) సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పాటలు ఆ టైంలో మార్మోగాయి. ఆ తర్వాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) సినిమాకి కూడా పనిచేశాడు. అది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) వంటి హిట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి.

Radhan

అయినా సరే ఇతనికి స్టార్ హీరోలకి పనిచేసే అవకాశం రాలేదు. అందుకు కారణం ఇతని ఆటిట్యూడ్ అని చాలామంది కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. రథన్ మంచి మ్యూజిక్ ఇస్తాడు. సూపర్ టాలెంటెడ్. ‘అయినప్పటికీ టైంకి ఔట్ఫుట్ ఇవ్వడు. ఏదో ఒక కారణం చెప్పి పని ఎగ్గొడతాడు. దర్శకనిర్మాతల్ని టెన్షన్ పెట్టేస్తాడు’.. వంటి కంప్లైంట్స్ ఇతనిపై ఉన్నాయి. రథన్ సంగీతం అందించిన చాలా సినిమాలకు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చారు అంటే.. విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఒక ఇంటర్వ్యూలో అయితే ‘ఇప్పటికి ఇప్పుడు నేను సినిమా వదిలేస్తే నువ్వు ఏం చేస్తావ్?’ అని రథన్ నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. గత ఏడాది వచ్చిన ‘సిద్దార్థ్ రాయ్’ సినిమా డైరెక్టర్ అయితే ‘చెన్నైలో ఉండి బ్రతికిపోయావ్ రథన్’ అంటూ స్టేజి పైనే అతనికి వార్నింగ్ ఇచ్చాడు.

ఏదేమైనా రథన్ ఆటిట్యూడ్ వల్ల.. తెలుగులో ఇప్పుడు అతనికి ఆఫర్లు లేకుండా పోయాయి అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మొన్నామధ్య చిరంజీవి   (Chiranjeevi)  ‘టాలెంట్ ఉన్నా డిసిప్లేన్ లేకపోతే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు’ అంటూ చేసిన చేసిన కామెంట్లు రథన్ లాంటి వాళ్లకి బాగా సెట్ అవుతాయి అని చెప్పాలి.

బాలయ్య ‘డాకు మహారాజ్’ డిజిటల్ రిలీజ్.. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus