హిట్టు కొట్టి సైలెంట్ అయిపోయారే..!

టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు, దర్శకులు అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే కొందరు దర్శకులు మాత్రం హిట్టు కొట్టి కూడా సైలెంట్ గా ఉంటున్నారు. తమ తదుపరి సినిమాల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ అనే సినిమా తీసి భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్.

ఈ సినిమాతో దర్శకుడిగా అతడికి మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమా రిలీజై రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు వేణు తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఫ్యూచర్ లో ఈ కాంబినేషన్ ఉంటుందో..? లేదో కూడా చెప్పలేని పరిస్థితి. రీసెంట్ గా ఈ డైరెక్టర్ కోసం నిర్మాత దిల్ రాజు ‘తమ్ముడు’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.

ఈ సినిమా ఎవరితో తీస్తారో తెలియాల్సివుంది. హీరోగా నాని పేరు వినిపిస్తోంది కానీ ఇంకా క్లారిటీ లేదు. వేణు శ్రీరామ్ మాదిరిగానే దర్శకుడు సాగర్ కె చంద్ర కూడా తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లానాయక్’ అనే సినిమా తీసిన సాగర్.. ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. 14 రీల్స్ బ్యానర్ లో ఓ సినిమా కమిటై అయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా వరుణ్ తేజ్ తో కానీ.. నితిన్ తో కానీ ఉంటుందట.

ఈ ఇద్దరు దర్శకులతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కూడా తన తదుపరి సినిమాకి సంబంధించి సైలెంట్ గా ఉంటున్నారు. అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా తీసి అతడికి హిట్టిచ్చిన ఈ దర్శకుడు.. తన నెక్స్ట్ సినిమా గీతాఆర్ట్స్ లో చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ విషయాన్ని అఫీషియల్ గా చెప్పలేదు. మొత్తానికి ఈ ముగ్గురు దర్శకులు హిట్టు కొట్టి కూడా సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యంగా ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus