ఖాన్స్, కపూర్స్ కలిసి వచ్చినా ప్రభాస్‌ని బీట్ కాదు కదా కనీసం టచ్ కూడా చెయ్యలేకపోయారు..!

టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా కమ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్‌ని మ్యాచ్ చేయడం.. రేంజ్‌ని అందుకోవడం ఎవరి వల్లా కావడం లేదు.. ఎలాగో ‘బాహుబలి’ లాంటి సినిమా తియ్యలేకపోయారు.. కనీసం ప్రభాస్ పేరుతో ఉన్న రికార్డులనైనా టచ్ చెయ్యాలని చూస్తున్నారు కానీ వాళ్ల కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి.. తన గత చిత్రాల టీజర్, ట్రైలర్లు రికార్డ్స్ క్రియేట్ చేశాయి.. నార్త్‌లో ప్రభాస్ ఇమేజ్ ఏకంగా తనతోనే హిందీలో భారీ బడ్జెట్‌తో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ఆదిపురుష్’ తీసే స్థాయికి వెళ్లింది..

సాధారణంగా ప్రభాస్ చాలా నార్మల్‌గా ఉంటాడు.. ఈ స్టార్‌డమ్స్, క్రేజ్, నంబర్ గేమ్స్, కలెక్షన్స్, రికార్డ్స్ లాంటివసలు పట్టించుకోడు.. తన పనేదో తాను చేసుకుంటూ ఉంటాడు.. కానీ కావాలని కదిలించే వాళ్లు కొంతమంది ఉంటారు కదా.. వాళ్లకి డార్లింగ్ ఫ్యాన్సే సమాధానం చెప్తుంటారు.. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లు ప్రతిదానికి ప్రభాస్‌తో పోటీపడదామని చూస్తుంటారు.. రీసెంట్‌గా ప్రభాస్ క్రియేట్ చేసిన సాలిడ్ రికార్డుని హిందీ ఖాన్స్, కపూర్స్, బీట్ కాదు కదా కనీసం టచ్ కూడా చెయ్యలేకపోయారనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది..

వివరాల్లోకి వెళ్తే.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ టీజర్, నవంబర్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయింది. ఫస్ట్ 24 గంటల్లో ‘ఆదిపురుష్’ టీజర్ రికార్డ్‌ని బీట్ చేస్తుందని భావించారు కానీ కుదర్లేదు.. హైలెట్ ఏంటంటే టాప్ 2‌లో ప్రభాస్‌వి రెండు సినిమాలున్నాయి.. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ‘ఖాన్స్, కపూర్స్ కలిసొచ్చినా మా హీరో రికార్డులని అందుకోలేరు.. త్వరలో సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బాలీవుడ్‌ని ఏలతాడు చూస్తూ ఉండండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పటివరకు విడుదల చేసిన 24 గంటల్లో హయ్యస్ట్ వ్యూస్ రాబట్టిన హిందీ టీజర్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ఆదిపురుష్ – 68.91 మిలియన్ వ్యూస్..

సాహో – 22.5 మిలియన్స్

భారత్ – 21.4 మిలియన్స్

కళంక్ – 20 మిలియన్స్

సంజు – 19 మిలియన్స్

పఠాన్ – 17.1 మిలియన్స్

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus