దర్శకుడు రాజమౌళితో సినిమా చెయ్యడానికి ఏ హీరో కమిట్ అయినా.. వాళ్ళ అభిమానులకు రెండేళ్ళ పాటు వెయిటింగ్ తప్పదు. ప్రభాస్ అభిమానులు ఇప్పటికే దాని అలవాటు చేసుకుని అనుభవిస్తున్నారు. ఈ లిస్ట్ లోకి చరణ్,ఎన్టీఆర్ లు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? అంటే కచ్చితంగా చెప్పలేము కానీ..ఈ 2019-20 సీజన్ ను బట్టి చూస్తే అది నిజమే అని ఒప్పుకోక తప్పదు. ‘అరవింద సమేత’ చితం 2018 అక్టోబర్ లో విడుదల అయ్యింది. ఆ తరువాత 2019 లో ఎన్టీఆర్ సినిమా రాలేదు.
ఇక రాంచరణ్ ‘రంగస్థలం’ తరువాత చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం 2019 లో విడుదలయ్యింది. కానీ ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ కాబట్టి.. అభిమానులు దానిని మర్చిపోవాలని చూస్తున్నారు.. టీవీల్లో మంచి టి.ఆర్.పి వస్తుంది కదా గుర్తు పెట్టుకోవాలని చూడటం లేదు. ఇక 2020 లో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ఉంటుంది అని ఎంతో ఆశగా ఎదురుచూస్తే.. అది 2021 జనవరి 8 కి మారింది. దీంతో 2020 లో కూడా వీళ్ళ పరిస్థితి జీరో అయిపొయింది.
ఇప్పుడు లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల 2 నెలల పాటు షూటింగ్ ఆగిపోయింది. రాజమౌళి లెక్కలో 2 నెలలు అంటే 6 నెలలోతో సమానం అని చాలా మంది ఫిక్సయిపోయారు. అందులోనూ 2021 సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల అసాధ్యం అని నిర్మాత దానయ్య కూడా తేల్చి చెప్పేసాడు. కాబట్టి అది 2021 సమ్మర్ కో లేదా ఏ ఆగష్టు 15కో మారిపోతుంది అని టాక్ నడుస్తుంది. మరి తరువాత అయినా ఎన్టీఆర్,చరణ్ లు వరుసగా సినిమాలు చేస్తారా..? అనేది పెద్ద ప్రశ్న?
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!