వందల మందితో షూటింగ్.. వాళ్ల పరిస్థితేంటో..!

  • April 28, 2021 / 08:34 PM IST

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృభిస్తోంది. ప్రభుత్వం కొన్ని షరతులు, పరిమితులు పెట్టడం తప్ప సరైన చర్యలు తీసుకోలేకపోతుంది. సినిమా థియేటర్లను క్లోజ్ చేయాలనే నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోలేదు. చిత్రసీమ తీసుకున్న నిర్ణయమది. షూటింగ్ ల విషయంలో కూడా అంతే.. ఫిల్మ్ ఛాంబర్ కొన్ని పరిమితులతో షూటింగ్స్ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చింది. నలభై నుండి యాభై మంది బృందంతో షూటింగ్ లు చేసుకోవచ్చని చెప్పింది. కానీ అలా జరగడం లేదు. టాలీవుడ్ కి చెందిన కొన్ని పెద్ద సినిమాల షూటింగ్ లు ఇష్టమొచ్చినట్లుగా నిర్వహిస్తున్నారు.

సెట్ లో వందల మంది ఉంటున్నాయి. కనీసపు జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. హైదరాబాద్ శివార్లలో ఓ పెద్ద సినిమా షూటింగ్ జరుగుతోంది. సెట్లో రెండు వందల మందికి పైగా కనిపిస్తున్నారు. అందరూ మాస్క్ లు పెట్టుకుంటున్నప్పటికీ.. భౌతిక దూరం పాటించడం లేదని సమాచారం. తమ సినిమాల షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని నిర్మాతలు చూస్తున్నారు కానీ యూనిట్ సభ్యుల రక్షణ కోసం పట్టించుకోవడం లేదు. సెట్ లో ఎవరికైనా కరోనా వస్తే.. ఆ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారట. బయటకి తెలిస్తే షూటింగ్ ఆపేయాల్సి వస్తుందని ఇలా చేస్తున్నారని అంటున్నారు.

హీరోలు, హీరోయిన్లు, పెద్ద ఆర్టిస్ట్ లు తమ షాట్ అయిన వెంటనే కార్వాన్ లోకి వెళ్లిపోతున్నారట. మరి షూటింగ్ స్పాట్ లో పని చేసే కెమెరా అసిస్టెంట్లు, జూనియర్ ఆర్టిస్ట్ ల పరిస్థితేంటి..? షూటింగ్ లు ఆగిపోతే నిర్మాతలకు లక్షల్లో నష్టం కాబట్టి ఎవరూ ఆపమని చెప్పడం లేదు. అలాంటప్పుడు కనీసం జాగ్రత్తలైనా తీసుకోవాలి కదా..! పొట్ట కూటి కోసం తమ జీవితాలను రిస్క్ చేసి మరీ షూటింగ్ లో పాల్గొంటున్న డైలీ వర్కర్ల కోసం ఎవరూ ఆలోచించరా..? ఇప్పటికైనా షూటింగ్ విషయంలో చిత్రసీమ సరైన నిబంధనలు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus