తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో సూర్య అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొదట్లో ఈయనకి తెలుగులో 15 కోట్ల మార్కెట్ ఉండేది. ‘7th సెన్స్’ ’24’ ‘గ్యాంగ్’ వంటి చిత్రాలు తమిళంలో ప్లాపైనా తెలుగులో మాత్రం హిట్టయ్యాయి అంటే సూర్య క్రేజ్ ఏంటనేది మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ మధ్యన ఆ క్రేజ్ తగ్గిపోతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ ఏడాది సూర్య హీరోగా రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి ‘ఎన్జీకే’ మరొకటి తాజాగా విడుదలైన ‘బందోబస్త్’.
‘ఎన్జీకే’ చిత్రానికి 9 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ సినిమాకి డిజాస్టర్ టాక్ రావడం వల్ల 4.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డబుల్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ ఎఫెక్ట్ ‘బందోబస్త్’ ప్రీ రిలీజ్ పై పడింది. ‘బందోబస్త్’ చిత్రానికి కేవలం 7 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. కానీ ఈ మొత్తం కలెక్ట్ చేస్తుందా అంటే అనుమానంగానే చెప్పాలి. సెప్టెంబర్ 20 న (నిన్న) విడుదలైన ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 75 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది. ‘గద్దలకొండ గణేష్’ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం.. అందులోనూ హరీష్ శంకర్ సినిమా కావడంతో భారీ రిలీజ్ ఇచ్చారు. దీంతో ‘బందోబస్త్’ కు థియేటర్లు పెద్దగా దొరకలేదు అందుకే మొదటి రోజే కోటి లోపు ఓపెనింగ్స్ తో చతికిలపడిపోయింది. ‘అందుకే ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ ఇవ్వొద్దని చెప్పాం సూర్య’ అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు.