బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం నామినేషన్స్ ఫుల్ హీటెక్కిపోయాయి. ఒకరి తలపై ఒకరు గుడ్డు పగలగొట్టుకుని మరీ నామినేట్ చేశారు. అంతేకాదు, లాస్ట్ వీక్ జరిగిన పాయింట్స్ ని మళ్లీ తీసుకుని వచ్చి రెచ్చిపోయారు. మాటకి మాట మాట్లాడుతూ, తూటాల్లా పంచ్ లు పేలుస్తూ నామినేట్ చేసుకున్నారు. ఈ నామినేషన్స్ ఫుల్ ఫైర్ లో ఒక రేంజ్ లో జరిగాయి. ముఖ్యంగా తేజస్వి అరియానా విషయంలో అషూరెడ్డిని లాక్ చేసింది.
మేము టీమ్ గా ఎవరం కూడా అరియానాని ఏడిపించాలి అని, మొక్కని పాడుచేయమని చెప్పలేదంటూ కౌంటర్స్ వేసింది. అలాగే, నటరాజ్ మాస్టర్ ని కూడా టార్గెట్ చేసింది. ఇక అఖిల్ అండ్ టీమ్ మహేష్ విట్టాని , యాంకర్ శివ – బిందులని టార్గెట్ చేశారు. ఈసారి నామినేషన్స్ లో యాంకర్ శివ మిత్రాశర్మాకి మద్యలో పెద్ద యుద్ధమే జరిగింది. యాంకర్ శివ మిత్రాని ఒక రేంజ్ లో ఆడుకున్నాడు. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేస్తూ నామినేట్ చేశాడు.
నువ్వు ఫేక్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి కానీ, నిన్ను ఫేక్ అంటే నువ్వు తీస్కోలేవంటూ రెచ్చిపోయాడు. అలాగే, నేను నీకేమన్నా చెప్తుంటే వెళ్లి నువ్వు వేరేవాళ్లకి ఆ విషయాన్ని మోస్తున్నావని నాకు అనుమానం అంటూ రెచ్చిపోయాడు. అలాగే మహేష్ విట్టా కూడా చిన్న చిన్న కారణాలకి నామినేషన్స్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. అలాగే మిత్రా శర్మా విషయంలో కూడా ఫుల్ ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నాడు. అలాగే, స్రవంతికి సాలిడ్ పంచ్ వేశాడు.
నామినేషన్స్ లో కూడా నువ్వు వెళ్లి అఖిల్ వెనకాల దాక్కున్నావ్ అంటూ మాటకి మాట చెప్పాడు. ఇక్కడే బిందు అఖిల్ కి పోటీగా ఒక సైన్యం తయారు చేస్తోంది. ఇందులో భాగమే యాంకర్ శివ, చైతూ ఇంకా ఉన్నారంటూ మహేష్ విట్టా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే, అఖిల్ టీమ్ ని కూడా ఆడుకున్నాడు. ఇక నామినేషన్స్ ప్రక్రియలో ఒకరిపై ఒకరు గుడ్లు కొట్టుకుంటూ ఉన్నారు. మహేష్ విట్టాకి ఎక్కువగా ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది. ఈవారం మొత్తం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు.
ఇందులో శివ, మిత్రాశర్మా, బిందుమాధవి, అనిల్, మహేష్ విట్టా, అరియానా, ఇంకా అషూరెడ్డిలు ఉన్నట్లుగా సమాచారం. అలాగే, ఈసారి స్రవంతి, అఖిల్, తేజస్వి, నామినేషన్స్ లోకి రాలేదు. కెప్టెన్ నటరాజ్ మాస్టర్ కాబట్టి మాస్టర్ ని కూడా ఎవ్వరూ నామినేట్ చేయలేదు. మరి వీళ్లలో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?