ఆంధ్రప్రదేశ్ లో మరో మా ఎన్నికలు!

గత ఏడాది తెలంగాణలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలాంటి గొడవలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ vs మంచు విష్ణు ప్యానెల్ కు పోటీ జరుగగా మంచు విష్ణు గెలిచాడు. ఇక ఆ తరువాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు కమిటీకి రాజీనామా చేయగా మరొక వివాదానికి తెరలేపినట్లు అయ్యింది. ఇక ఆ సంగతి పక్కన పక్కన పెడితే ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఆంద్రప్రదేశ్ ‘మా’ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లుగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా అధికారికంగా వివరణ ఇచ్చారు.

రాష్ట్ర విభజనం అనంతరం ఆంద్రప్రదేశ్ లో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి అని 2018లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 24 విభాగాలతో యూనియన్‌ను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్ – 196 నంబర్ తో 14.2.2018 న ఆమోదించింది. ఇక 24 విభాగాలకు చెందిన 400 మంది టెక్నీషియన్లు, నటీనటులు ఇందులో ఏపీ మా లో సభ్యులుగా ఉన్నారు. ఇక ప్రతీ సారి ఈ యూనియన్ లో కూడా ఎన్నికలు నిర్వహించాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ యూనియన్ లో మాత్రం పెద్దగా పేరున్న సెలబ్రిటీలు ఎవరు లేరు.

ఇక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రేజరర్, ఈసీ మెంబర్లకు ఎన్నికలు జరుగుతాయని ప్రతినిధులు తెలియజేశారు. ఇక ఇటీవల నామినేషన్ల స్వీకరణ మొదలు పెట్టారు. జరగబోయే ఎన్నికల తేదీని మార్చ్ 31 అనంతరం ఎన్నికల అధికారి ప్రకటిస్తారు.. అని దిలీప్ రాజా తెలిపారు. ఇక తెలంగాణాలో మా ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదని పోటీ చేసే అభ్యర్థులు విధిగా భారతీయ సినిమాకు చెందిన వారు అయి ఉండాలని అన్నారు.

ఇక ఈసారి కూడా రీసెంట్ గా నామినేషన్ల ప్రక్రియ మొదలైందని, నాయకత్వ లక్షణాలున్న ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆయన తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు విధిగా భారతీయులు అయి ఉండాలని, అలాగే విధిగా మా ఏపీలో సభ్యత్వం కలిగి ఉండాలని ఆయన చెప్పారు. ఎన్నికల తేదీని మార్చ్ 31 అనంతరం ఎన్నికల అధికారి ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus