మారుతున్న హీరోల రెమ్యునరేషన్ డీల్స్..!

టాలీవుడ్ లో (Tollywood) సినిమా అంటే ఖర్చులే కాదు.. లాభాల విషయానికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకప్పుడు హీరోలు కేవలం రెమ్యునరేషన్ తీసుకుంటే సరిపెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టాప్ స్టార్లు కేవలం పారితోషికంతోనే కాకుండా, సినిమా లాభాల్లోనూ వాటా కోరుతున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌లో సర్వసాధారణమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నుంచి మొదలెడితే, ఒకానొక సమయంలో ఆయన సినిమాల క్రెడిట్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కనిపించేవి.

Tollywood

ఇది లాభాల బేరం కాదన్నప్పటికీ, పరోక్షంగా వాటా తీసుకునే విధానమేనని సినీ వర్గాల్లో చర్చ ఉండేది. ఇప్పుడు మాత్రం మహేష్ రెమ్యునరేషన్‌పై ఫిక్స్ అయ్యారట. అదే తరహాలో అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఒకప్పుడు ప్రొడక్షన్ పార్ట్‌నర్‌గా ఉంటే, ‘పుష్ప 2’కి (Pushpa 2) ఏకంగా లాభాల్లో 27.5% వాటా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంకా ముందుకెళ్లితే, ఎన్టీఆర్ (Jr NTR) సినిమాల్లో కూడా లాభాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు స్పష్టంగా చూపిస్తోంది.

మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లాంటి మిడిల్ రేంజ్ హీరో కూడా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని నైజాం హక్కులు తీసుకోవడం ఇప్పుడు హెల్తీ ట్రెండ్‌గా మారింది. ఇది నిర్మాతలకు కూడా లాభదాయకమే. అదే విధంగా హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon)  కూడా తన బ్యానర్ ద్వారా లాభాల్లో భాగమవుతోంది. దర్శకుల విషయానికొస్తే త్రివిక్రమ్ (Trivikram), సుకుమార్ (Sukumar) లాంటి టాప్ డైరెక్టర్లు తమ బ్యానర్ల ద్వారా సినిమాల లాభాల్లో వాటా పొందుతున్నారు. ఇది వారికి ఎక్స్ట్రా ఇన్‌కమ్ మాత్రమే కాదు..

సినిమాపై మరింత బాధ్యతగా పనిచేసేలా కూడా చేస్తోంది. నిర్మాతలకు ఇది ఒకవిధంగా భరోసా కూడా అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas), రామ్ చరణ్ (Ram Charan) మాత్రం రెమ్యునరేషన్‌నే ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. కానీ రాబోయే రోజుల్లో వీరందరూ కూడా లాభాల్లో వాటా కోసమే ప్లాన్ చేస్తారన్నదే టాక్. ఓవర్ ఆల్‌గా చూస్తే, టాలీవుడ్ లో (Tollywood) ఇప్పుడు ‘రెమ్యునరేషన్ సరిపోదు.. లాభాల్లో వాటా కావాలి’ అన్న ఫార్ములా స్ట్రాంగ్‌గా నిలిచిపోయింది. ఇది పరిశ్రమలో లాభాల పంచకానికి ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

కూలీ.. తెలుగులో రిస్కీ బిజినెస్..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus