Coolie: కూలీ.. తెలుగులో రిస్కీ బిజినెస్..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో తెరకెక్కుతున్న కూలీ (Coolie) మూవీపై సౌత్ ఇండియా అంతా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర (Upendra), శ్రుతిహాసన్ (Shruti Haasan)  వంటి స్టార్లతో పాటు హై ఓక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు భారీ క్రేజ్ తీసుకొచ్చాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఆగస్టు 14న వరల్డ్‌వైడ్ రిలీజ్‌గా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Coolie

సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. తమిళంలో నేరుగా రిలీజ్ చేయనుండగా, తెలుగులో మాత్రం డబ్ వెర్షన్ హక్కులు విక్రయించేందుకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, కూలీ తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.50 కోట్లకు అమ్మేందుకు ట్రై చేస్తుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ డీల్‌ని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు డౌటుగా చూస్తున్నాయి. ఎందుకంటే ఓ తమిళ డబ్బింగ్ మూవీని రూ.50 కోట్లకు కొంటే, బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.110 కోట్లు వసూలు కావాలి.

రజినీ క్రేజ్ ఉన్నా, డబ్బింగ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గిన సంగతి తెలిసిందే. జైలర్ (Jailer) తర్వాత కూడా రజినీ మార్కెట్ టెస్టింగ్‌ఫేజ్‌లోనే ఉంది. ఇదే నేపథ్యంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు దిల్ రాజు (Dil Raju), నాగవంశీ (Suryadevara Naga Vamsi), సునీల్ నారంగ్ వంటి వారు ఈ హక్కుల కోసం పరిశీలనలో ఉన్నారని సమాచారం. కానీ వారు ఆఫర్ చేసిన ధర రూ.40 కోట్లు అని టాక్. దీంతో రూ.10 కోట్ల గ్యాప్ కారణంగా డీల్ ఆలస్యం అవుతోంది.

పైగా ఇదే సమయానికి ఎన్టీఆర్  (Jr NTR) వార్ 2 (War 2) కూడా రిలీజ్ అవుతుండడంతో పోటీ ఎక్కువగా ఉండబోతోంది. మొత్తానికి రజినీ సినిమా కావడం, లోకేష్ బ్రాండ్‌కి ఉన్న బజ్ ఉండడంతో ఒక ఎక్సపెక్టేషన్ ఉన్నా.. బిజినెస్ పరంగా టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూలీ ఒక రిస్కీ చాయస్‌గా కనిపిస్తోంది. మరి ఈ భారీ సినిమా తెలుగులో ఎవరి చేతికి వెళ్లనుంది? నిజంగా ఆ పెట్టుబడికి రెట్టింపు రాబడి వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

శ్రీలీలతో లవ్ రూమర్స్.. యువ హీరో ఏమన్నారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus