విజయ దేవరకొండ ఎంచుకునే కథలు మాత్రమే కాదు అందులోని పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. గీత గోవిందం సినిమా రిలీజ్ కాకముందే అందులోని “ఇంకేం ఇంకేం కావాలే” పాట అందరినోటా మారుమోగాయి. అందుకే ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తోన్న నోటా సినిమాలో పాటలపై అంచనాలు పెరిగాయి. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీకి సామ్ సిఎస్ సంగీత దర్శకత్వం వహించారు. అతను స్వరపరిచిన పాటలు ఎలా ఉన్నాయంటే… ఈ ఆల్బంలో ఆరు ట్రాక్స్ ఉన్నాయి. అందులో వాయిస్ ఉన్న పాటలు నాలుగే. మిగిలిన రెండు సినిమా థీమ్ ప్రకారం ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్. ఇక శ్రీమణి రాసిన తొలిపాట “ఎత్తరా ఎత్తరా”ని ఫుల్ బీట్స్ తో కంపోజ్ చేశారు.
యాజిన్ నిజార్, స్వాగత, కృష్ణన్ లో పాటని ఎత్తడానికి కష్టపడ్డారు కానీ తొందరగా మైండ్ లోకి ఎక్కడంలేదు. రెండో పాట “రాజ రాజ కుల” కాస్త డిఫరెంట్ గా అనిపిస్తోంది. వెండితెరపై చూస్తే ఇంకా బాగుంటుందనిపిస్తుంది. రాజేష్ ఏ మూర్తి రాసిన “హే మినిస్టర్” ట్యూన్ బాగుంది. అయినా నిముషం మాత్రమే ఉండడం నిరాశపరిచింది. ఆల్బం లో ఆఖరి పాట “ఎవరిదీ పాపం”. సినిమాలోను క్లైమాక్స్ లో వచ్చేలా ఉంది. ఇది నిడివి తక్కువ ఉండడం.. కథలో మిళితమైన పాట కావడంతో మ్యూజిక్ లవర్స్ ని అట్రాక్ట్ చేయడం లేదు. మొత్తం మీద ఆల్బం మెప్పించలేకపోయింది. కథమీదే భారం పడింది. ఈనెల 5 రిలీజ్ కానున్న ఈ సినిమా ఎంతమేర విజయ్ కెరీర్ కి ఉపయోగపడుతుందో చూడాలి.