ఒక హీరో కోసం రాసిన కథను మరో హీరో చేయడం పెద్ద విషయమేమీ కాదు. మామూలుగా అయితే ఆ సినిమా విడుదలయ్యాక ఈ విషయం గురించి మాట్లాడుకుని ‘అవునా అలా జరిగిందా?’ అనుకునేవాళ్లు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ విషయం బయటికొచ్చేస్తోంది. ఇంకా చెప్పాలంటే సినిమా షూటింగ్ మొదలుకాకుండానే ఆ కథతోనే ఈ హీరో సినిమా చేస్తున్నాడు అనేస్తున్నారు. తాజాగా ఇలాంటి మాట పడుతున్న చిత్రం #NTR30.
తారక్ జన్మదినం సందర్భంగా కొరటాల శివ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమా థీమ్‌ను డైలాగ్ రూపంలో చెప్పారు కూడా. ఈ పోస్టర్‌ను కొరటాల శివ టీమ్ రూపొందించిన విధానం చూస్తుంటే… అల్లు అర్జున్‌తో కొరటాల చేస్తారు అన్న సినిమాకు, దీనికి దగ్గర సంబంధాలు ఉన్నాయని అనిపిస్తోంది. ఒక్క పోస్టర్‌తోనే అలా చెప్పేయొచ్చా అంటే అవుననే అనిపిస్తోంది. చుట్టూరా నీరు, ఉరుములు, మెరుపులు, రక్తం, పడవలు.. మొత్తంగా చిన్నపాటి భయం కలిగించేలా పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఎన్టీఆర్ చేతిలో రెండు విచిత్రమైన కత్తులు కూడా ఉన్నాయి. చెప్పిన డైలాగ్‌లో భయం, ధైర్యం గురించి ప్రస్తావించారు. గతంలో అల్లు అర్జున్‌తో కొరటాల శివ సినిమా అన్నప్పుడు రాజకీయ నేపథ్యంలో ఉంటుందని వార్తలొచ్చాయి. విద్యార్థి రాజకీయాల గురించి సినిమాలో ప్రస్తావిస్తారు అని కూడా పుకార్లు వచ్చాయి. ఇప్పుడు తారక్ పోస్టర్ చూస్తుంటే అలాంటి రాజకీయాల వాసలు ఏవీ కనిపించడం లేదు కానీ బ్యాగ్రౌండ్, కలర్ కాంబినేషన్ మాత్రం అలానే ఉంది.
ఈ రెండు పోస్టర్లలో తేడా బాగా గమనిస్తే అల్లు అర్జున్ పోస్టర్‌లో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఇందులో తారక్ ఒక్కడే కనిపిస్తాడు. ఇద్దరు ఒక్కడు అయ్యారా? అయితే ఎందుకయ్యారు అనేది ఇక్కడ విషయం. పోస్టర్ల రంగులు పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ వద్దన్న కథను ఎన్టీఆర్ చేస్తున్నాడు అంటున్నారు . దీనిపై కొరటాల కానీ, తారక్ కానీ చెప్పాలి. ఒకవేళ అదే కథ చేస్తుంటే మార్పులు అయితే పక్కాగా ఉంటాయి అని చెప్పొచ్చు.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!