Shankar: శంకర్ కి ఇప్పుడు ఆప్షన్ లేనట్టే?

Ad not loaded.

‘రోబో’ నుండి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)  డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అనేది కొందరి అభిప్రాయం. వాళ్ళు అలా అనడానికి కారణాలు కూడా లేకపోలేదు. ఆ తర్వాత శంకర్ తీసిన ఫలితాలు కూడా అలాంటివి. ‘రోబో’ (Robo) టైం తన ఆస్థాన రైటర్ సుజాత (Sujatha) మరణించారు. శంకర్ కి ఉన్న పెద్ద బలం ఆయనే. ఆయన పోయిన తర్వాత ఆప్షన్ లేక.. ‘3 ఇడియట్స్’ ని (3 Idiots) రీమేక్ చేశారు. విజయ్ (Vijay Thalapathy) వంటి హీరోతో చేసినా ఆ సినిమా.. తమిళంలో కూడా ఆడలేదు.

Shankar

తర్వాత విక్రమ్ ను హీరోగా పెట్టి భారీ బడ్జెట్ తో ‘ఐ’ అనే సినిమా చేశాడు. అది కూడా ఆడియన్స్ ని మెప్పించలేదు. ఇక అటు తర్వాత సుజాత ఇచ్చిన ఐడియాని వేరే టీంతో డెవలప్ చేయించి ‘2.o’ (Robo 2.0) చేశాడు. అది కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇన్ టైంలో కంప్లీట్ చేసి రిలీజ్ చేసి ఉంటే.. అది మరింత మంచి ఫలితాన్ని ఇచ్చేదేమో. ఇక అటు తర్వాత చేసిన ‘ఇండియన్ 2’  (Indian 2)  ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.

సో ఇప్పుడు శంకర్ తో సినిమాలు చేయాలంటే నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ‘గేమ్ ఛేంజర్’ లో ఒకటి, రెండు పాటలు తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా క్వాలిటీ కనిపించలేదు. ‘జరగండి జరగండి’ పాటలోని విజువల్స్ పై ఏ రేంజ్లో ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు శంకర్ తో వర్క్ చేయడానికి కూడా హీరోలు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని వినికిడి.

ఇటీవల శివ కార్తికేయన్ ని (Sivakarthikeyan) మీట్ అయ్యి కథ చెప్పినా అతను ఇంట్రెస్ట్ చూపించలేదట. ఈ టైంలో శంకర్ కి ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. అది ‘ఇండియన్ 3’. రెండో భాగం డిజాస్టర్ అయ్యింది కాబట్టి దీనికి బజ్ రావడం, బిజినెస్ అనుకున్నట్టు జరగడం కష్టం. దీన్ని ఏదో ఒక రకంగా రిలీజ్ చేయించి సక్సెస్ అందుకుంటే.. శంకర్ నెక్స్ట్ ప్రాజెక్టుకి హెల్ప్ అవుతుంది. లేదు అంటే ఇక కష్టమే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus