తెలుగులో విభిన్న కథలతో చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కొత్తదనానికి తెలుగు ప్రేక్షకులు ఘన స్వాగతం పలుకుతున్నారు. సో ఆ దిశగా డైరక్టర్లు, హీరోలు అడుగులు వేస్తున్నారు. తేజ దర్శకత్వంలో వస్తున్న “నేనే రాజు నేనే మంత్రి” సినిమా కూడా విభిన్న కథతో రూపుదిద్దుకున్నదే. ఇందులో రానా పోషించిన జోగేంద్ర క్యారక్టర్ లో సంగం పాజిటివ్, సగం నెగటివ్ ఉంటుందంట. కథ ప్రకారం చివరలో హీరోని ఉరి తీస్తారు. అయితే తెలుగు చిత్రాల్లో యాంటీ క్లైమాక్స్ ఉంటే హిట్ కాదనే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ని తిరగరాయడానికి తేజ కొత్త క్లైమాక్స్ ని రాసుకున్నారని చిత్ర బృందం వెల్లడించింది. అలాగే తెరకెక్కించారంట.
మరి ప్రేక్షకులు ఎలా స్వాగతిస్తారోనని కొంత భయం ఉన్నప్పటికీ.. స్క్రిప్ట్ పై, కథపై పూర్తి విశ్వాసంతో చిత్ర యూనిట్ ఉంది. వాళ్ళ నమ్మకం ఎంత మేర నిజమవుతుందో.. ఈ శుక్రవారం తెలియనుంది. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా అశితోష్ రాణా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో పాటు అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలు సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఫలితం మాత్రమే మిగిలివుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.