ఒక్క ఫోటోతో ఎన్టీఆర్, ఫ్యాన్స్ ని ఫిదా చేశాడే.. !

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం పీక్స్ లో ఉంది. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు అయినప్పటికీ వారు ఎటువంటి సంబరాలు జరుపుకో లేని పరిస్థితి. దానికి కారణం ఆర్ ఆర్ ఆర్ నుండి వారు ఊహించిన ఫస్ట్ లుక్ వీడియో లేకపోవడం మరియు, లాక్ డౌన్ కారణంగా వారు అనుకున్నట్లు ఎటువంటి వేడుకలు నిర్వహించ లేకపోవడం. ఐతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఒక్క ఫోటోతో చెదరగొట్టాడు ఎన్టీఆర్. సిక్స్ ప్యాక్ బాడీలోని ఆయన సరికొత్త అవతారం ఫ్యాన్స్ ని పిచ్చ ఖుషి చేస్తుంది.

విడుదల చేసిన కొద్ది నిమిషాలలోనే వైరల్ గా మారిన ఆ ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ఫోటోని షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తో విరుచుకు పడుతున్నారు. ఎన్టీఆర్ టెంపర్ మూవీ నుండి సిక్స్ ప్యాక్ మెయిటైన్ చేస్తున్నాడు.ఆయన గత చిత్రం అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో కూడా మొదటి సన్నివేశంలోనే సిక్స్ ప్యాక్ బాడీలో వీరోచిత పోరాటం చేసి ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు. ఐతే తాజా ఫొటోలో ఎన్టీఆర్ షర్ట్ లేకుండా బేర్ బాడీలో పిచ్చి లేపారు.

తాజా ఫోటో నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ లుక్ పై అంచనాలు పీక్స్ వెళ్లాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ ఓ నయా అవతారంలో అద్భుతం చేస్తాడు అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో లేటైనా ఎన్టీఆర్ అద్భుతం చేయనున్నాడనే నమ్మకం ఫ్యాన్స్ లో మొదలైంది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో చరణ్ ఫస్ట్ లుక్ వీడియోకి ఏమాత్రం తగ్గకుండా, అంతకు మించి ఉంటుంది అనిపిస్తుంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus