రాజమౌళిని అందరూ పని రాక్షసుడు అంటారు. ఆ మధ్య ‘ఆర్‌ఆర్ఆర్’ టీమ్ అంతా రాజమౌళి పని తీరు గురించి కంప్లైంట్ ఇచ్చినట్లు ఓ వీడియో కూడా చేశారు. అయితే అందులో రాజమౌళి కుటుంబ సభ్యులు లేరు. మరి రాజమౌళి గురించి, అతని పనితీరు గురించి కుటుంబ సభ్యులు ఏమంటారు? ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా. ఇదే విషయం గురించి తారక్ ఇటీవల చెప్పుకొచ్చాడు. సెట్స్‌లో తను, చరణ్ ఇబ్బంది పడే సమయం వచ్చినప్పుడు ఆ విషయం జక్కన్న ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చెబితే ఏమంటారు అనేది చెప్పుకొచ్చాడు తారక్.
సినిమా మొదలెట్టాక… హీరోల గురించి పట్టించుకోకుండా సినిమా బాగా వచ్చిందా లేదా అనేది మాత్రం రాజమౌళి చూస్తారని ఆ మధ్య మనం చదువుకున్నాం. ఒక్కోసారి రాజమౌళి పనిరాక్షసత్వం ఎక్కువై, పర్‌ఫెక్షన్ కోసం ఇంకా ఇంకా ట్రై చేస్తున్నప్పుడు… తమ కష్టం చెప్పుకోవడానికి సెట్స్‌లో ఉండేది ఇద్దరే అని చెప్పాడు తారక్. ఒకరు వల్లి అయితే, ఇంకొకరు అమీనా ఉరఫ్ రమా రాజమౌళి అట. వాళ్లతో రాజమౌళి గురించి చెబితే ఏం చేస్తారు అనేది తారక్ సరదాగా చెప్పుకొచ్చాడు.
సెట్స్‌లో వరుస సీన్స్ చేశాక కాస్త అలసటగా ఉంటే చెప్పుకుందాం అంటే రాజమౌళి వినే రకం కాదని, అందుకే వల్లి, రమ దగ్గర మాత్రమే చెప్పేవాళ్లం అని తెలిపాడు తారక్. ఓ సారి తారక్ వల్లమ్మ దగ్గరకి వెళ్లి ‘ఏంటమ్మా ఇది’ అని అంటే… ఆమె ‘పిచ్చి నాన్న పిచ్చి’ అనేవారట. ఏంటి మరి ఆయన మారరా అంటే.. ‘లేదమ్మా పెరిగింది నాన్న పెరిగింది’ అనేవారట వల్లి. సరిగ్గా ఆటైమ్‌లోనే కార్తికేయ వచ్చి ‘రా!’ అనేవారట. ఏంటి ఎందుకు అని అడిగితే ‘షాట్ రెడీ అంట… వెళ్దాం పద’ అనేవారట.
దాంతో మళ్లీ వల్లి దగ్గరకు వెళ్లి ‘ఏంటమ్మా ఇప్పుడే కదా నలిపేశాడు’ అంటే… ఆమె తిరిగి ‘వెళ్లరా బంగారం, షాట్ త్వరగా అయిపోద్ది పో. ఆ పిచ్చోడి త్వరగా తేల్చుకొని వచ్చేయ్ వెళ్లిపోదాం’ అంటారట. దీంతో ఇదేం లాజిక్ బాబోయ్ అనుకునేవాడట తారక్. సరిగ్గా అదే సమయంలో కీరవాణి వచ్చి… ఏంటి సంగతులు అని అడుగుతారట. ‘చంపేస్తున్నాడు సర్‌జీ’ అని తారక్ అంటే. తిరిగి కీరవాణి ‘ఆయనంతే ఆయనా.. అయినా నాకెందుకు చెబుతున్నావ్. నేనేం చేయగలను. నా వల్ల కాదు’ అనేసి వెళ్లిపోయేవారట.
దీంతో ఈ డిస్కషన్ రమ దగ్గరకు తీసుకెళ్తే… ‘ఆయనంతే… ఏం ఫర్లేదులే. నువ్వుండు అని కాసేపు ఆపి, నువ్వెళ్లి షాట్ చేసుకొచ్చేయ్’ అనేవారట. ఆఖరికి కార్తికేయ దగ్గర చెబుదాం అనుకుంటే… అక్కడా అంతే. కార్తికేయకు మొత్తం విషయాలు తెలుసు. అయితే ఒకప్పటి కార్తికేయ వినేవాడు. కానీ ఇప్పుడు లైన్ ప్రొడ్యూసర్ అయిపోయాక పరిస్థితులు మారిపోయాయి. మేం బాధలు చెబుతుంటే ఫోన్ పట్టుకొని ఒక్క నిమిషం అన్నా ఫోన్ వచ్చింది అంటూ వెళ్లిపోయేవాడట. అలా మమ్మల్ని ఎవరూ పట్టించుకునేవాళ్లే ఉండేవారు కాదు అని చెప్పాడు తారక్.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!