అభిమాన కథానాయకుడి సినిమా వస్తోందంటే… తమ ప్రేమను చూపించుకోవడానికి అభిమానులు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఒకప్పుడు దీనికి ఉన్న ఒకే ఒక్క అవకాశం.. రిలీజ్ రోజు థియేటర్ల ముందు బ్యానర్లు, కటౌట్లు కట్టడం. సోషల్ మీడియా, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక… అభిమానం చాలా రకాలుగా చూపించే అవకాశం వస్తోంది. అలాగే ఆ అభిమానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు కనిపిస్తోంది. ‘ఆర్ఆర్‌ఆర్’ విడుదల సందర్భంగా ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. ‘ఆర్ఆర్‌ఆర్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చాలామంది అభిమానులు తమ ప్రేమను చూపిస్తున్నారు. అలా కొంతమంది చూపించిన ప్రేమను, ఆ క్రియేటివిటీని చిత్రబృందం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తోంది. అందులో ఇటీవల షేర్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. పేపర్ కప్పులతో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ముఖాలను పేర్చడం. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఇద్దరి కోసం వేర్వేరు కప్పులు వాడకుండా ఒకే కప్పులపై ఇద్దరి ఫొటోలు వేయడం. అదే ఆ ఆర్ట్‌లో స్పెషాలిటీ. RRR Art పేరుతో ఎన్టీఆర్, చరణ్ ఫొటోలను తీర్చిదిద్దిన ఆ వీడియో వీక్షకులను అబ్బుర పరుస్తోంది.
15 వేల టీకప్పులతో ఆరు రోజుల పాటు శ్రమించి ఒకవైపు రామ్‌చరణ్, మరోవైపు ఎన్టీఆర్ కనపడేలా ఆర్ట్ వేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోను చూసి ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ స్పందించింది. ‘అద్భుతమైన ఆర్ట్. అంతులేని మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని సమాధానమిచ్చింది. కావాలంటే మీరూ చూడండి ఆ క్రియేటివిటీ ఎంత బాగుందో. ఇక విదేశాల్లో కూడా సినిమాకు వెల్ కమ్ చెబుతూ ఫ్యాన్స్ క్రియేటివిటీ చూపిస్తున్నారు.
కార్లతో ర్యాలీలు, కార్లను RRR అనేఅక్షరాలుగా నిలపడం… ఇలా చాలా ఆసక్తికరమైన ప్రచారం చేస్తున్నారు. వీటిపై ఆ మధ్య రాజమౌళి, రామ్‌చరణ్, తారక్ స్పందిస్తూ వాళ్లు చూపిస్తున్న ప్రేమకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని కూడా అన్నారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ సినిమా థియేటర్ల దగ్గర ఇంకెంత సందడి చేస్తుందో చూడాలి.
Frist time in india 🇮🇳 @RRRMovie
Art 15k tea – cups 6 days day and night hordwork 🔥
One frame two 🌟🌟 @tarak9999 and @AlwaysRamCharan art by @Pooriarts2 #RRRMovie #RRRMovieOnMarch25th #RRR pic.twitter.com/2ZuQAZQY9X— Poori arts (@Pooriarts2) March 22, 2022
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!