బాలయ్యకి కలిసొచ్చే సీజన్లోనే ఎన్టీఆర్ బయోపిక్

సంక్రాంతి మొనగాడిగా బాలకృష్ణకి మంచి పేరుంది. బాలయ్య కెరీర్ మొదట్లో సంక్రాంతికి వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయనకీ ఇప్పటికీ ఆ సీజన్ కలిసివస్తుంది. గత ఏడాది “గౌతమీపుత్ర శాతకర్ణి”, ఈ ఏడాది “జై సింహా” సినిమాలు మరో సారి ఆ విషయాన్నీ నిరూపించాయి. అందుకే తన తండ్రి నందమూరి తారకరామారావు బయోపిక్ మూవీ”ఎన్టీఆర్”ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం బాలకృష్ణ భుజానికి ఆపరేషన్ చేసుకున్నారు. నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారు.

అప్పటి లోపున డైరక్టర్ తేజ.. వెంకటేష్ సినిమాని ఓ కొలిక్కి తీసుకురానున్నారు. అలాగే బయోపిక్ కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సెలక్షన్ పూర్తి చేయనున్నారు. సాయి కొర్ర పాటి నిర్మిస్తున్న మూవీలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రోల్ ని పోషించడానికి నదియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన అన్ని కీలక ఘట్టాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఎన్టీఆర్ అభిమానులకు తెలియని ఎన్నో సంగతులు ఈ సినిమా కళ్ళకు కట్టనుంది. ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus