యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ అభిమానులను కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటారు. అన్న అని పిలిస్తే ఇంటికి వెళ్ళిపోతారు. అందుకే అతనంటే ఫ్యాన్స్ ప్రాణమిస్తారు. ఈనెల మే 20న ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఇప్పటి నుంచే సంబరాలు మొదలెట్టారు. ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేయనున్నారు. పెద్ద ఎత్తున రక్తదానాలు, అన్నదానాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కొంతమంది విభిన్నమైన కానుకను అందిస్తున్నారు. తారక్ పై ఉన్న అభిమానాన్ని అక్షరాల్లోనింపారు. ఎన్టీఆర్ సినిమా విశేషాలు, ఆయన గొప్పతనం తెలిపేలా ఓ పుస్తకం రాశారు.
అందులో ఉన్న పేజీని రోజుకొకటి చొప్పున రిలీజ్ చేస్తున్నారు. తాజాగా పేజీ నంబర్ 8ను విడుదల చేశారు. అందులో మాతృదేవోభవ అనే శీర్షికన ఎన్టీఆర్, ఆయన తల్లి ప్రేమానురాగాలను ఇందులో వివరించారు. తల్లి పట్ల ఎన్టీఆర్‌కున్న అభిమానం, ఈ రోజు ఈ స్థాయిలో ఎన్టీఆర్ ఉండటం వెనుక ఆయన తల్లి కృషి, మరెన్నో ఆసక్తికర విషయాలను ఇందులో పొందుపరిచారు. దీంతో ఈ పుస్తకం పై ఆసక్తి పెరిగింది. ఎన్టీఆర్ గురించి మరిన్ని విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.