ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన ‘ఉప్పెన’ దర్శకుడు..!

  • February 10, 2021 / 08:01 PM IST

ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘ఉప్పెన’ చిత్రం మరో రెండు రోజుల్లో అంటే.. ఫిబ్రవరి 12న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులంతా ప్రమోషన్ల కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులను చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా గతంలో ఈయన.. ఎన్టీఆర్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

ఆ టైములోనే ‘ఉప్పెన’ కథను ఎన్టీఆర్ కు వినిపించాడట. ఆ సందర్భాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు. దర్శకుడి మాట్లల్లో.. ” ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకి సంబంధించి ఓ సాంగ్ షూటింగ్ కోసం విదేశాలలో ఉన్న ఎన్టీఆర్ కి ‘ఉప్పెన’ కథ వినిపించాను. ఇది మీకు కాదు సర్.. ఓ కొత్త హీరోకి అయితే బాగుంటుందని చెప్పాను. కథ విన్న తరువాత.. ‘ఎన్టీఆర్ చాలా బాగుంది, ఎక్కడ కొట్టేశావ్ రా’ అన్నాడు. ఎన్టీఆర్ అలా కామెంట్ చేసాడంటే..

నేను రాసుకున్న కథలో మేటర్ ఉన్నట్టే అని ఆ టైములో నేను సంతోషపడ్డాను. ఎన్టీఆర్ సెట్స్ లో అందరితోనూ ఇట్టే కలిసిపోతుంటాడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పటికీ నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. పెద్ద స్టార్ అనే ఫీలింగ్ ఆయనకు ఉండదు. అందరితోనూ సరదాగా కలిసిమెలిసి ఉంటాడు” అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు.ఇక మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus