వరుసగా నాలుగు సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ తప్పకుండా 5వ ఆచార్య సినిమాతో కూడా ఎంతో కొంత భారీ స్థాయిలోనే మెప్పిస్తాడు అని అందరూ అనుకున్నారు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని ఊహించారు. కానీ ఈ సినిమా విడుదలకు ముందే పెద్దగా హైప్ క్రియేట్ చేయలేక పోయింది.
ఇక విడుదల తర్వాత మొదటి రోజు మొదటి షోకే ఫలితం పై క్లారిటీ వచ్చేసింది. మొత్తంగా ఆచార్య సినిమా వలన నిర్మాతలకు దాదాపు 80 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలాంటి దెబ్బ పడితే ఆ దర్శకుడితో భవిష్యత్తులో చేయబోయే ఎలాంటి హీరో అయినా సరే కొంత ఆందోళన చెందకుండా ఉండలేడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పరిస్థితి కూడా అదే తరహాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. RRR సినిమా తర్వాత ఎలాగైనా పాన్ ఇండియా మార్కెట్ లో నిలదొక్కుకోవాలి అని ఎన్టీఆర్ కూడా ఎంతగానో తాపత్రయపడుతున్నాడు.
ఆ మార్కెట్ కోసమే త్రివిక్రమ్ తో కూడా లోకల్ ప్రాజెక్టును కాదని కొరటాల శివను లైన్ లో పెట్టాడు. అయితే ఇప్పుడు కొరటాల శివ ఇలాంటి షాక్ ఇవ్వడంతో మరొకసారి అతనితో కాన్ఫిడెన్స్ తో చేయలేక చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరొకసారి స్క్రిప్ట్ పై కూర్చోవాలని పర్ఫెక్ట్ గా బౌండ్ స్క్రిప్ట్ సిద్దమైన తరువాతనే షూటింగ్ కు వెళ్లాలని ఆలోచిస్తున్నాడట. అంతే కాకుండా కథలో కాస్త రిస్క్ అనుకున్న పాయింట్స్ పై కూడా మరోసారి ఆలోచించి డెవలప్ చేయాలని కూడా ఎన్టీఆర్ మాట్లాడుతున్నాడట. కొరటాల శివ విషయంలో ఎన్టీఆర్ నమ్మకం కాస్త సన్నగిల్లిపోయినట్లు అనిపిస్తోంది. ఏదేమైనా RRRతో వచ్చిన క్రేజ్ ను ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని తారక్ డిసైడ్ అయినట్లు టాక్. మరి ఆ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యం అవుతుందా లేదంటే అనుకున్న సమయానికే స్టార్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.