జై లవ కుశ లోగోకి అభినందనలు గుప్పిస్తున్న ఫ్యాన్స్
- April 5, 2017 / 10:50 AM ISTByFilmy Focus
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా లోగో ఈరోజు రిలీజ్ అయి అభినందనలు అందుకుంటోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లలో కల్యాణరామ్ నిర్మిస్తున్న చిత్రానికి జై లవ కుశ అనే అటైటిల్ ని అనుకుంటున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అదే నిజమైంది. అంతేకాదు తారక్ ఇందులో మూడు పాత్రల్లో కనిపిస్తుండడం ఖాయమని స్పష్టమయింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ లోగోను ట్విట్టర్లో తారక్ రిలీజ్ చేయగానే లైక్లు, షేర్లు ద్వారా ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. లోగో చాలా బాగుందని కామెంట్స్ రూపంలో వెల్లడించారు.
లక్షల్లో ఈ లోగోకి రెస్పాన్స్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 లో లోగో ట్రెండ్ అయింది. తారక్ పక్కన ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా, అందులో ఒక కథానాయికగా రాశీఖన్నాను ఎంపిక చేశారు. బాలీవుడ్ ప్రముఖ కెమెరామెన్ సీ కే మురళీధరన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ మూవీ టీమ్ లో హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ కూడా ఉన్నారు. ఈ ఫిల్మ్ కి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















