Jr NTR: ఆ ఫోటోను చూసి తెగ ఫీలైపోతున్న తారక్ ఫ్యాన్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మూడున్నరేళ్ల తర్వాత తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కొమురం భీమ్ పాత్రతో తారక్ మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా తారక్ దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలను చరణ్, రాజమౌళితో కలిసి చుట్టి వచ్చారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో తారక్ హైలెట్ గా నిలిచారు.

Click Here To Watch NOW

తారక్ ఎనర్జీతో చెప్పిన విషయాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం తారక్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోను చూసిన తారక్ అభిమానులు తారక్ కు ఎంత కష్టమొచ్చింది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ వల్ల తారక్ కు సరిగ్గా తిండి, నిద్ర లేదు. రోజుకో సిటీకి తిరుగుతూ ఉండటంతో ప్రైవేట్ జెట్ లోనే తారక్ నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫ్లైట్ లో తారక్ కార్తికేయపై కాలు వేసి ఆదమరిచి నిద్రపోతుండగా ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. విశ్రాంతి లేకుండా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం తారక్ పడిన కష్టాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ యాక్షన్ సీక్వెన్స్ ల కోసం తారక్, చరణ్ పడిన కష్టం అంతాఇంతా కాదు. అయితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా తప్పకుండా దక్కుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. తారక్ ఈ స్థాయిలో కష్టపడిన సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమే కావడం గమనార్హం. బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ మూవీ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. నిర్మాత దానయ్య ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus