ఎన్టీఆర్30.. ఎప్పుడు మొదలవుతుందో!

‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా తరువాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 వ చిత్రంగా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ఇందులో నటిస్తోన్న రామ్ చరణ్ ‘ఆచార్య’ షూటింగ్ లో పాల్గొంటూ.. తన తదుపరి సినిమాల గురించి ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టలేదు.

నిజానికి ఈ సినిమా సంక్రాంతి నాడు లాంఛ్ చేస్తారని అంతా భావించారు. నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కూడా దీనిపై హింట్ ఇచ్చింది. కానీ సినిమా మొదలుకాలేదు. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ అప్సెట్ అయ్యారు. కనీసం ఎప్పుడు మొదలుపెడతారో కూడా చెప్పలేదు. పైగా ఇప్పుడు త్రివిక్రమ్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ సినిమాపై పని చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాకి ఆయన మాటలు, స్క్రీన్ ప్లే నే అందిస్తున్నప్పటికీ.. ఎక్కువ సమయం పవన్ సెట్ లోనే ఉంటున్నారట.

సినిమాకి సంబంధించిన చాలా విషయాలు ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారట. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారని టాక్. తమ హీరో సినిమాను పట్టించుకోకుండా, కనీసం ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా మరో సినిమాకి వర్క్ చేస్తుండడం తారక్ ఫ్యాన్స్ ని బాధ పెడుతోంది. ఇప్పటికైనా చిత్రబృందం లాంఛింగ్ డేట్ ని అనౌన్స్ చేస్తే తారక్ ఫ్యాన్స్ కి ఊరట కలుగుతుంది!

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus