Jr NTR: అలా జరిగితే యంగ్ టైగర్ ప్లానింగ్ మారుతుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నుంచి అరవింద సమేత సినిమా వరకు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలను విడుదల చేస్తూ తారక్ సత్తా చాటారు. 2009 సంవత్సరం మినహా అరవింద సమేత వరకు ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ నటించిన సినిమాలు విడుదలయ్యాయి. 2009లో తారక్ నటించిన మూవీ రిలీజ్ కాకపోయినా 2010లో మాత్రం ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి.

అయితే గత రెండు రోజుల నుంచి వైరల్ అవుతున్న ఒక వార్త ఎన్టీఆర్ అభిమానులను తెగ టెన్షన్ పెడుతోంది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాల తరహాలో సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా ఈ వార్త వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది.

సలార్ రెండు భాగాలుగా తెరకెక్కితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. త్వరలో సలార్ చిత్ర యూనిట్ నుంచి ఈ వార్త గురించి క్లారిటీ వస్తుందేమో చూడాలి. సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతుందనే వార్త ప్రభాస్ అభిమానులకు మాత్రం సంతోషాన్ని కలిగిస్తోంది. ఇతర హీరోలకు భిన్నంగా ప్రభాస్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాకు సంబంధించి ఫిబ్రవరి 2వ తేదీన అప్ డేట్ రానుందని సమాచారం.

2వ తేదీ 2వ నెల 2022 సంవత్సరం కావడంతో ఆరోజు అప్ డేట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాల విషయంలో వేగం పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ సైతం కొత్త కథలను వింటున్నారని త్వరలో మరికొన్ని ప్రాజెక్ట్ లకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సలార్ రెండు భాగాలుగా తెరకెక్కితే ఎన్టీఆర్ ప్లానింగ్ మారే ఛాన్స్ అయితే ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus