ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీలో ఆ బాలీవుడ్ బ్యూటీ..!

  • March 30, 2020 / 06:57 PM IST

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. జనవరి 8 2021 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజమౌళి సినిమా కాబట్టి ఎన్టీఆర్ కు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. దీన్ని తరువాతి చిత్రాలకి కూడా క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. విషయం ఏమిటంటే… ఎన్టీఆర్ తన తరువాతి చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.

‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా పూజా హెగ్డే ను సెలెక్ట్ చేసారని తెలుస్తుంది. కథ ప్రకారం ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందట. దీంతో ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలి అనే ఆలోచనలో టీం ఉన్నట్టు తెలుస్తుంది.

అందుతున్న సమాచారం ప్రకారం… ఆ బాలీవుడ్ భామ దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అని తెలుస్తుంది. ఈమెకు అక్కడ క్రేజ్ ఎక్కువ కాబట్టి… ‘ఎన్టీఆర్ 30’ ని అక్కడ ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. గతంలో ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ ‘సాహో’ విషయంలో కూడా ఇలాగే ప్లాన్ చేసి శ్రద్దా కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఫలితంగా బాలీవుడ్ లో ఆ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus