టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా తన భార్యకి ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్చి 18న ఎన్టీఆర్ భార్య.. లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకి స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఎన్టీఆర్. దీనికోసం హైదరాబాద్ నగరంలో ఖరీదైన ఫామ్ హౌస్ ని కొనుగోలు చేశాడట. దాన్ని పుట్టినరోజు నాడు ప్రణతికి కానుకగా ఇచ్చాడట. భర్త ఇచ్చిన గిఫ్ట్ ప్రణతికి బాగా నచ్చిందట. ఇదే ఫామ్ హౌస్ లో స్నేహితులను, బంధువులను పిలిచి గ్రాండ్ గా పార్టీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
కుటుంబసభ్యులందరూ కూడా ఈ ఫామ్ హౌస్ లో బాగా ఎంజాయ్ చేశారట. ప్రణతి తన భార్య స్థానంలో జీవితంలోకి వచ్చినప్పటి నుండి తారక్ ఎంతో సంతోషంగా ఉంటున్నాడు. సందర్భం వచ్చిన ప్రతీసారి తన భార్యపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు ఎన్టీఆర్. తన జీవితాన్ని ప్రణతి చక్కదిద్దుతుందని.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ లాంటి ఇద్దరు కొడుకులను బహుమతులుగా ఇచ్చిందని తారక్ ఎప్పటికప్పుడు చెబుతుంటాడు. పిల్లలంటే ఎన్టీఆర్ కి ప్రాణం. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఉండాలనే చూస్తుంటాడు ఎన్టీఆర్.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఎన్టీఆర్. ఈ ఏడాది ఉగాది సందర్భంగా సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.