సీమలో ఒకలా… సిటీలో మరోలా కనిపించనున్న తారక్!

రాయల సీమ కథలకి తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి అనుబంధం ఉంది. సీమలో కత్తి పడితే .. థియేటర్లో కలెక్షన్లు కురిపిస్తాయి. సీమ నేపథ్యంలో తెరకెక్కిన అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. ఆ జాబితాలో “అరవింద సమేత వీర రాఘవ” చేర్చడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కష్టపడుతున్నారు. అజ్ఞాతవాసి ఫెయిల్ తో గుణపాఠం నేర్చుకున్న మాటలమాంత్రికుడు సొంత కథను రాసుకున్నారు. మన నేటివిటీకి సంబంధించిన సంఘటనలను మేళవించారు. రాయలసీమ యువకుడిగా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా దాదాపు 40 శాతం షూటింగ్ జరుపుకుంది. ఎల్లుండి నుంచి భారీ షెడ్యూల్ పొల్లాచిలో మొదలుకానుంది.

ఇందులో తారక్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తారని ఫస్ట్ లుక్ స్పష్టం చేసింది.అలాగే రాయలసీమ యాసలో డైలాగులు అదరగొట్టనున్నారు. తాజాగా ఇందులో ఎన్టీఆర్ క్యారక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయంట.  రాయలసీమలో వీర రాఘవరెడ్డిగా, సిటీలో సిద్ధార్థ్‌ గౌతమ్‌గా రెండు కోణాలున్న పాత్రలో తారక్ కనిపిస్తారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. సీమలో ఒకలా, సిటీలో మరోలా ఎన్టీఆర్ ఆకట్టుకోనున్నారు. సిటీలో సాఫ్ట్ గా క్లాస్ ఆడియన్స్ ని మెప్పించనున్నారు. సీమలో ఊర మాస్ గా యాక్షన్ సీన్స్ లో నటించి విజిల్స్ వేయించనున్నారు. దసరాకి ఎన్టీఆర్ డబుల్ ధమాకా యాక్షన్ ఫుల్ గా ఎంటర్టైన్ చేయనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus