నిరాశపరిచిన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ మొదటిరోజు కలెక్షన్లు..!

  • January 10, 2019 / 01:06 PM IST

నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఎన్టీఆర్- కథానాయకుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9 న (నిన్న) విడుదలైన సంగతి తెలిసిందే . మొదటి షో నుండీ ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొంత ల్యాగ్ ఉండనే కంప్లైంట్స్ ఉన్నప్పటికీ… బయోపిక్ అకౌంట్ లో అది కొట్టుకు పోయింది. మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ గా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రీ -రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది. దాదాపు 70 కోట్ల వరకు ఈ చిత్రానికి బిజినెస్ జరిగింది. అయితే మొదటి రోజు వసూళ్ళ లో మాత్రం.. మంచి కలెక్షన్లు రాబట్టలేకపోయింది. బాలయ్య గత చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కలెక్షన్లను కూడా అధిగమించలేకపోయింది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా … దాదాపు 12.75 కోట్ల వరకూ వసూలు చేయగా… ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కేవలం 10.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే… ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తో పాటు ‘పైసా వసూల్’ కలెక్షన్లను కూడా అధిగమించలేక పోయింది. ఆఖరికి నందమూరి బాలకృష్ణ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉన్న ఏరియా ‘సీడెడ్’ లో ఈ చిత్రం 1 కోటి లోపే షేర్ నమోదు చేయడం గమనార్హం. వీక్ డేస్ కారణంగా.. ఇంత తక్కువ కలెక్షన్లు నమోదయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సంక్రాంతి పండుగ సెలవులు ఉన్నప్పటికీ… ‘పేట’ ‘వినయ విధేయ రామా’ ‘ఎఫ్2’ వంటి చిత్రాల పోటీని తట్టుకుని ‘కథానాయకుడు’ ఎలా నిలబడతాడో చూడాల్సి ఉంది.

ఇక ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం- 1.75 కోట్లు

వైజాగ్- 0.85 కోట్లు

ఈస్ట్ – 0. 41 కోట్లు

వెస్ట్- 0.55 కోట్లు

కృష్ణ- 0.74 కోట్లు

గుంటూరు- 2.03 కోట్లు

నెల్లూరు- 0.52 కోట్లు

సీడెడ్- 0.85 కోట్లు

——————————-

ఏపీ & టీఎస్ కలెక్షన్స్- 7.7 కోట్లు

———————————

యూఎస్ఏ- 1.85 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్- 0.95 కోట్లు

————————————————

వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 10.5 కోట్లు (షేర్) – 17 కోట్లు (గ్రాస్)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus