అక్కినేని, నందమూరి వారసుల కలయికలో చిత్రం!

తెలుగు చిత్ర పరిశ్రమ తొలి తరం కథానాయకులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన మిస్సమ్మ, గుండమ్మ కథ చిత్రాలు ఆణిముత్యాలుగా నిలిచాయి. ఆ సమయంలోనే మల్టీ స్టారర్ మూవీలు చేసి అద్భుత విజయాలను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాలకు చెందిన హీరోలు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

త్వరలో ఫ్యాన్స్ కోరిక నేర వేరనుంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్ అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తన రెండో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసిన డైరక్టర్ ఆర్టిస్టుల సెలక్షన్ లో బిజీగా ఉన్నారు. తాజాగా సావిత్రి పాత్రకు నిత్యామీనన్ ను ఎంపిక చేశారు.  ఇందులో అన్నదమ్ముల పాత్రలకు అక్కినేని, నందమూరి వారసులను తీసుకోనున్నట్లు తెలిసింది.

తారక్, చైతూ అయితే సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని నాగ్ అశ్విన్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మంచి కథ దొరికితే మల్టీ స్టారర్ మూవీలకు చేయడానికి సిద్ధమని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. మహానటి సావిత్రి బయోపిక్ లో నటించడానికి  చైతు, తారక్ ఓకే చెబుతారని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus