ఎన్టీఆర్ కొత్త ఇంటిలోని విశేషాలు

  • November 29, 2016 / 12:18 PM IST

మహానటుడు నందమూరి తారక రామారావు ఆశీస్సులతో తారక్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. టీనేజ్ లోనే హీరో గా హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇరవైఒక్క ఏళ్లకే టాలీవుడ్ స్టార్ హీరో అయ్యారు. చిన్నప్పటినుంచి మెహిదీ పట్నం లోని సంతోష్ నగర్ కాలనీలోని ఇంటిలో పెరిగిన ఎన్టీఆర్ సంపాదన పెరిగిన తర్వాత  తన అభిరుచి మేరకు కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 31 ఉన్న కొత్త ఇల్లు ప్రస్తుత విలువ 40 కోట్లు. ఈ అత్యాధునిక భవనంలో మరెన్నో విశేషాలున్నాయి. 1587 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఈ ఇంటిలో 8 బెడ్ రూమ్స్, 3 హాల్స్ ఉన్నాయి.

ఫ్లోర్ కి ఎక్కువ భాగం ఇటాలియన్ మార్బల్స్ వాడారు. సింగపూర్ నుంచి తెప్పించిన గ్లాస్ ఫ్లోరింగ్ ని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ఫిట్ చేశారు. కెన్యా నుంచి దిగుమతి చేసుకున్న ఫర్నిచర్ ఇంటి లోపలి భాగానికి మంచి లుక్ ని తెచ్చి పెట్టింది. అంతేకాదు ఈ అందమైన బిల్డింగ్ లో ఓ జిమ్, స్విమ్మింగ్ ఫూల్, మినీ థియేటర్ కూడా ఉన్నాయి. తల్లి షాలిని, భార్య లక్ష్మి ప్రణతి, కొడుకు అభయ్ రామ్ తో కలిసి ఈ ఇంటిలో ఎన్టీఆర్ కొంతకాలంగా నివసిస్తున్నారు. ఇంటి ముందు కొంత భాగాన్ని పచ్చని మొక్కలతో నింపారు. తన ఇల్లే బెస్ట్ ప్లేస్ అని తారక్ పలు మార్లు చెప్పారు. అంత ఆహ్లాదకరంగా ఈ ఇంటిని నిర్మించుకున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus