వరుస పరాజయాలు…ఎంత ట్రై చేసినా దక్కని హిట్, కరియర్ ఏమయిపోతుందో అన్న అభిమానుల భయం, ఇవన్నీ యువ నటుడు ఎన్టీఆర్ కరియర్ లో ఒకప్పుడు ఎదురైన ఇబ్బందులు ప్రశ్నలు…అయితే దెబ్బతిన్న బెబ్బులి…తిరగబడితే ఎలా ఉంటుంది…ఒక్కసారి పంజా విసిరి తొడగొడితే ఎలా ఉంటుంది…వరుస పెట్టి రికార్డులను వేటాడితే ఎలా ఉంటుంది…ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానమే ప్రస్తుతం ఎన్టీఆర్ అనుకుంటున్న వరుస అవార్డుల పంట….అవును ఎన్టీఆర్ మళ్లీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఒకప్పుడు నిక్కర్లు వేసుకునే కాలంలోనే కొమ్ములు బడా హీరోలకు చెక్ పెట్టి రికార్డులను తన చుట్టూ తిప్పుకున్నాడు….ఇక ఇప్పుడు ఒకే సంవత్సరం బెస్ట్ యాక్టర్ గా టోటల్ ఇండస్ట్రీని షేక్ చేసేలా అన్ని అవార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఫిల్మ్ ఫేర్ నుండి ఐఫా దాకా, శంకరాభరణం నుండి జీ సినిమా అవార్డుల దాకా ఎన్.టి.ఆర్ నటనా ప్రతిభకు అవార్డులు వరుస కట్టడం విశేషం. లాస్ట్ ఇయర్ సుకుమార్ డైరక్షన్ లో నాన్నకు ప్రేమతో, కొరటాల శివ డైరక్షన్ లో జనతా గ్యారేజ్ రెండు సినిమాల్లో నటించిన తారక్ రెండు సినిమాల్లో రెండు సరికొత్త వేరియేషన్స్ తో ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా చేశాడు.
నందమూరి హీరోలంటే కత్తి పెట్టి నరకడమే అన్న నానుడి పోయి ఖతర్నాక్ కథలతో కేవలం ఇండస్ట్రీ రికార్డులనే కాదు ఆడియెన్స్ మనసులను దోచేస్తున్నాడు తారక్. జనతా గ్యారేజ్ లో అద్భుతమైన నటనకు గాను తారక్ ఫిల్మ్ ఫేర్, ఐఫా, శంకరాభరణం, జీ సినిమా అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ గా అవార్డులు అందుకున్నాడు తారక్. ఇక జరుగుతున్న సైమా అవార్డుల్లో కూడా ఎంతోమంది నామినేషన్ వేసినా ఎన్.టి.ఆర్ కే బెస్ట్ యాక్టర్ పట్టం కట్టేశారు. జ్యూరీ టీం మాత్రమే కాదు ఆడియెన్స్ పోల్ లో కూడా ఎన్.టి.ఆర్ బెస్ట్ యాక్టర్ గా నిలిచి 2017 సైమా అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు. అదీ ఎన్టీఆర్ స్టామినా అంటే…అదీ ఎన్టీఆర్ అంటే…అదీ ఎన్టీఆర్ రేంజ్ అంటే…ఎన్టీఆర్ కెప్యాసిటీ…అంటే. మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ తనంటే ఏంటో మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.