ఈ సంవత్సరం ఎక్కువమంది ఎదురుచూస్తున్న సినిమా జనతా గ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు వంటి హిట్లు ఇచ్చిన కొరటాల శివ దర్శ కత్వంలో “నాన్నకు ప్రేమతో” వంటి విజయం అనంతరం యంగ్ టైగర్ చేస్తున్న చిత్రం కావడంతో దీని పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నడంతో మరింత క్రేజ్ ఏర్పడింది.
ఒక పాట, కొన్ని సీన్లు మినహా జనతా గ్యారేజ్ షూటింగ్ మొత్తం పూర్తి అయింది. బ్యాలన్స్ షూటింగ్ బ్యాంకాక్ లో చేయనున్నారు. చిత్ర యూనిట్ విదేశాలకు పయన మయ్యే లోపల టీజర్ ను విడుదల చేయాలని భావిస్తోంది. ఇందుకోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. శనివారం నుంచి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారు.
కొంత సినిమాకు డబ్బింగ్ చెప్పిన అనంతరం మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీటిలో బెస్ట్ పార్ట్ ని కట్ చేసి జులై 6న జనతా గ్యారేజ్ తొలి టీజర్ ను విడుదల చేయనున్నట్లు కొరటాల శివ చెప్పారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 12న తెలుగు, మలయాళం భాషల్లో విడుదల కానుంది.