ఎన్టీఆర్ కు ఏమయింది? అసలు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు? దాదాపుగా వరుస హిట్స్ సాధించి, హ్యాట్రిక్ సక్సెస్ కొట్టి, ఇంత గ్యాప్ తీసుకుంటున్న హీరోగా ఎన్టీఆర్ ఎందుకు మారిపోయాడు? ఏ కధ చేయాలని అసలు ఎన్టీఆర్ ఆశిస్తున్నాడు? ఇదే ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ లో రగులుతున్న అగ్ని పర్వతం. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది? ఇప్పటివరకూ చిన్నా చితకా దర్శకుల నుంచి బడా దర్శకుల వరకూ ఎన్టీఆర్ కు అందరూ కధలు వినిపించారు…అవి నచ్చినట్లే ఉంటున్నాయి..కానీ నచ్చడంలేదు. అసలు కారణమే ఏంటో తెలీదు కానీ….దర్శకుడు పూరీ జగన్నాధ్, రచయిత వక్కంతం వంశీ మొదలుకొని, అనిల్ రావి పూడి, చివరకు పవర్ సినిమా రచయిత బాబీ కూడా ఎన్టీఆర్ కు కధ వినిపించిన దర్శకుల్లో ఉన్నారు.
అయితే కధ విన్నప్పుడల్లా చేసెద్దం అంటున్న ఎన్టీఆర్ వేరే కధ వినే సమయానికి మనసు మార్చుకుంటున్నాడట….ఇదిలా ఉంటే తాజాగా మరి రచయిత తెరపైకి వచ్చాడు…ఆయన ఎవరంటే మన కోనా వెంకట్….అసలే పిల్మ్ నగర్ జనాల ప్రకారం చాలా రోజుల నుండి ఒకటే ఫార్ములా కథను తీసుకుని.. దానినే అటు వార్చి ఇటు వార్చి సినిమాలు తీయడం తీయించడం అంటే మాత్రం అది కోన వెంకట్ కే చెల్లింది అన్న బ్యాడ్ టాక్ బలంగా ఉంది, మరి అలాంటి రచయత కధను ఎన్టీఆర్ వంటి మాస్ హీరో ఒప్పుకోవడం ఇప్పుడు మరింత వింతగా అనిపిస్తుంది. అంతేకాదు…పై దర్శకుల కధల్లో లేని మ్యాటర్ కోన వెంకట్ కథలో ఏముందో అని అందరూ ఆలోచనలో పడ్డారు. మరి ఈ కధ అయినా ఎన్టీఆర్ ఓకే చేస్తాడో లేక, మళ్లీ ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.