‘ఆర్ఆర్ఆర్’ టీజర్: మన్యం ముద్దుబిడ్డగా ఎన్టీఆర్ అదరగొట్టాడబ్బా!

మన్యం వీరుడు కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా ఈ రోజు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్, అలాగే టీజర్ రిలీజ్ చేశారు. సినిమాలో అతడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఏ సినిమా లోనూ కనిపించని సరికొత్త గెటప్ లో ఎన్టీఆర్ కనిపించాడు.

“వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా… వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ… వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ! నా తమ్ముడు, గోండు బెబ్బులి… కొమురం భీమ్” అంటూ ఎన్టీఆర్ పాత్రను రామ్ చరణ్ తన వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేశారు.

చరణ్ వాయిస్, డైలాగులు ఎంత వీరోచితంగా ఉన్నాయో… ప్రచార చిత్రం లో ఎన్టీఆర్ లుక్ కూడా అంతే వీరోచితంగా ఉంది. కండలు తిరిగిన దేహంతో మన్యం ముద్దుబిడ్డ గా ఎన్టీఆర్ అదరగొట్టాడు. ముఖ్యంగా టీజర్ లో 53 సెకండ్ల దగ్గర ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ అండ్ బాడీ సూపర్బ్ అని చెప్పాలి. కేక పుట్టించాడు. అలాగే టీజర్ చివర్లో ముస్లిం టోపీ పెట్టుకుని సర్వమత సమ్మేళనం సందేశాన్ని ఇచ్చారు.

దర్శకధీరుడు రాజమౌళి టేకింగ్ కూడా సూపర్. టీజర్ ప్రారంభంలో అడవుల్ని, ఆ తర్వాత వర్షంలో చినుకులు పడుతుండటాన్ని చాలా అందంగా చూపించారు. వాడు కనబడితే సముద్రాలు తలపడతాయి డైలాగ్ దగ్గర దానికి తగ్గట్టుగా తీసిన షాట్ సూపర్. ప్రతి ఫ్రేమ్ లోనూ డి.వి.వి.దానయ్య నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

1

2

3

4

 

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus