Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 14, 2026 / 08:13 AM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సంతోష్ శోభన్ (Hero)
  • మానస వారణాసి (Heroine)
  • రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగిబాబు తదితరులు (Cast)
  • అశ్విన్ చంద్రశేఖర్ (Director)
  • అజయ్ కుమార్ రాజు (Producer)
  • ఆదిత్య రవీంద్రన్ (Music)
  • దినేష్ పురుషోత్తమన్ (Cinematography)
  • గణేష్ శివ (Editor)
  • Release Date : ఫిబ్రవరి 14, 2026
  • విఆర్ గ్లోబల్ మీడియా (Banner)

హీరోగా పరిచయమై దశాబ్దం పూర్తిచేసుకున్నప్పటికీ.. సరైన కమర్షియల్ హిట్ కోసం సంతోష్ శోభన్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. అందుకే ఓ రెండేళ్లు గ్యాప్ తీసుకొని మరీ “కపుల్ ఫ్రెండ్లీ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాని సంతోష్ ప్రమోట్ చేసిన విధానం, సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ఆ బజ్ కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందా? సంతోష్ హిట్టు కొట్టాడా? అనేది చూద్దాం..!!

Couple Friendly Movie Review

Couple Friendly Movie Review and Rating

కథ: నెల్లూరులో తండ్రి తిట్లు పడలేక చెన్నైలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు శివ (సంతోష్ శోభన్). తండ్రిని, అన్నయ్యని డబ్బు అడగడానికి ఇబ్బందిపడుతూ, చిన్నపాటి ఖర్చుల కోసం బైక్ షేర్ చేస్తూ ఉంటాడు. అలా పరిచయమైన అమ్మాయి మిత్ర (మానస వారణాసి). ఒకానొక సందర్భంలో ఇద్దరూ కలిసి ఉండాల్సి వస్తుంది. అప్పటినుండి ఒకరికి ఒకరు తోడుగా నిలిచి, ఇద్దరు కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తారు.

అంతా బాగానే సాగుతుంది అనుకునే తరుణంలో.. పెద్ద షాక్ ఇస్తుంది మిత్ర. మిత్ర ఇచ్చిన షాక్ ఏంటి? దాన్నుండి శివ ఎలా తేరుకున్నాడు? అనేది “కపుల్ ఫ్రెండ్లీ” కథాంశం.

Couple Friendly Movie Review and Rating

నటీనటుల పనితీరు: మానస వారణాసి మొదటి సినిమా అయిన “దేవకీ నందన వాసుదేవ”లో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి “ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు!” అనుకున్నవాళ్ళలో నేను ఒకడిని. ఆ క్రిటిసిజానికి మిత్ర పాత్రతో గట్టిగా సమాధానం ఇచ్చింది మానస. ఫస్టాఫ్ లో ఎంత రిలేటబుల్ గా ఉందో, సెకండాఫ్ లో ఆమె పాత్ర అంతే బరువుగా ఉంటుంది. పాత్ర తాలూకు బరువును, బాధను కళ్ళల్లో, ముఖంలో ఆమె పలికించిన తీరు అభినందనీయం.

సంతోష్ శోభన్ ఎప్పుడూ నటుడిగా తన బెస్ట్ ఇస్తాడు. ప్రతి సినిమాలోనూ తన పాత్రను ఎంతో బాధ్యతతో పోషిస్తాడు. అయితే.. ఈ సినిమాలో పోషించిన శివ అనే పాత్ర మాత్రం ఓన్ చేసుకున్నాడు. గెటప్, లుక్స్, మ్యానరిజమ్స్ అన్నీ చాలా సహజంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ సీక్వెన్స్ లో హాస్పిటల్ సీన్ లో యాక్సెప్టెన్స్ ను కళ్ళల్లో పలికించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే.. నిరాశ నిస్పృహలను సంతోష చాలా ఈజీగా పండిస్తాడు. సంతోష్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ గా శివ పాత్ర నిలిచిపోతుంది.

రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగిబాబు తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

Couple Friendly Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ సీన్ కంపోజిషన్ లో చూపిన నవ్యత ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. సందర్భాలు ఎక్కడో చూసినట్లుగా ఉన్నాయి అనిపించినప్పటికీ, వాటిని డీల్ చేసిన విధానం మాత్రం కొత్తగా ఉంది. ముఖ్యంగా డైలాగ్స్ చాలా సింపుల్ & ఎఫెక్టివ్ గా ఉన్నాయి. వదిన పాత్రతో చెప్పించిన “మీరు నిలబడండి, మేం చూసుకుంటాం” అనే డైలాగ్ చాన్నాళ్లు గుర్తుండిపోతుంది. అలాగే.. ప్రతి విషయాన్ని చాలా ఓపికగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఏ ఒక్క ఎమోషన్ కానీ, సందర్భం కానీ ర్యాండం గా వచ్చేసాయి అనిపించవు. హీరో క్యారెక్టర్ బిహేవియర్ మొదలుకొని, సందర్భాలు, సమస్యలు, కష్టాలు అన్నిటికీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అలాగే.. మెటాఫరికల్ గా చెప్పిన అంశాలు కూడా బాగున్నాయి. మీరే అర్థం చేసుకోండి అని ప్రేక్షకుల మీదకి వదిలేయకుండా, సింపుల్ గా అర్థవంతంగా మెటాఫర్స్ ను వినియోగించిన విధానం బాగుంది. ఓవరాల్ గా.. మొదటి సినిమాతోనే అశ్విన్ దర్శకుడిగా, రచయితగా మంచి హిట్ అందుకున్నాడు.

దినేష్ సినిమాటోగ్రఫీ & ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమాని మరింత సహజంగా తీర్చిదిద్దాయి. దాదాపుగా లైవ్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల సినిమా చాలా ఫ్రెష్ గా ఉంది. అలాగే.. ఆదిత్య తనదైన నేపథ్య సంగీతంతో ఎమోషన్స్ ను ఎలివేట్ చేసిన తీరు అమోఘం.

ఆర్ట్ & ప్రొడక్షన్ టీమ్ వర్క్ కూడా బాగుంది. జియోగ్రాఫికల్ గా, ఎకనామికల్ సిచ్యుయేషన్ బట్టి బ్యాగ్రౌండ్ ను తీర్చిదిద్దిన తీరు ప్రశంసార్హం. నిర్మాతలు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అని స్పష్టమైంది.

Couple Friendly Movie Review and Rating

విశ్లేషణ: ఇప్పటివరకు “కపుల్ ఫ్రెండ్లీ”ని ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేసారు. కానీ ఇది అంతకుమించిన సినిమా. జీవితంలో మెమరీస్ & మూమెంట్స్ కి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఒకసారి తట్టి చెబుతుంది. అలాగని.. మరీ ఏడిపించే విధంగా ఏమీ ఉండదు. సరదాగా ఎంగేజ్ చేస్తూనే, హృద్యంగా అలరిస్తుంది.

మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సొంత మనుషుల మధ్య యాంత్రికంగా బ్రతికేస్తున్నాం.. ఒక్కసారి ఆ యాంత్రిక జీవితాన్ని పక్కన పెట్టి, మనసుపెట్టి ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది అనే విషయాన్ని గుర్తుచేశాడు దర్శకుడు అశ్విన్. ఈ ప్రేమికుల దినోత్సవాన.. మంచి సంతృప్తినిచ్చిన సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. సంతోష్ శోభన్ హిట్ కొట్టడమే కాదు, నటుడిగా రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు.

Couple Friendly Movie Review and Rating

ఫోకస్ పాయింట్: కపుల్స్ కే కాదు.. ప్రేక్షకులందరికీ ఒక కంప్లీట్ నెస్ ఇచ్చే సినిమా!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Couple Friendly Movie
  • #Manasa Varanasi
  • #Santosh Soban

Reviews

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

6 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version