ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ వివరాలు.!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయింది. నగర శివార్లలో జరిగిన తొలి షెడ్యూల్ లో రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఒక యాక్షన్ సీన్ ని చిత్రీకరించారు. దీంతో ఒక వారం రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. మే మొదటి వారంలో రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మొదలుకాబోతోంది. 4 కోట్లతో నిర్మితమైన రాయ‌ల‌సీమకు చెందిన ఓ గ్రామం సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారు.

ఈ షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డే, యంగ్ హీరో నవీన్ చంద్రతో పాటు ప్రధాన పాత్రలందరూ పాల్గొననున్నారు. చాలా రోజులకి సీమ నేపథ్యంలో తారక్ సినిమా చేస్తుండడంతో క్రేజ్ నెలకొంది. అంతేకాదు ఇందులోఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నారని సమాచారం. అజ్ఞాతవాసి అపజయం పాలవడంతో త్రివిక్రమ్ ఈ సినిమా పై మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలిసింది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. జై లవకుశ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ చిత్రానికి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చే పనిలో ఎస్.ఎస్.థమన్ బిజీగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus